AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode: మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని..

Munugode: మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
Revanth Kcr
Ganesh Mudavath
|

Updated on: Sep 11, 2022 | 4:10 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 48 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సొంత గ్రామాల్లో వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వీఆర్‌ఏల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించని పక్షంలో కాంగ్రెస్ (Congress) పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని లేఖలో వివరించారు. మరోవైపు.. మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతోంది. ఇప్పటికీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించిన అధిష్టానం గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పార్టీ నేతలను ఏకతాటిపై తెచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భేటీ నిర్వహించారు. మునుగోడులో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

కాగా.. మునుగోడులో విజయం తమదంటే తమదేనని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మునుగోడులో విజయం టీఆర్ఎస్ దేనని మంత్రులు, నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఆయన పాలనలో రాష్ట్రం సురక్షితంగా ఉందని వివరంచారు. అయితే టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. పాల్వాయి స్రవంతిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..