Viral Video: ఎస్పీకి కోపం వచ్చింది.. అధికారాన్ని ఉపయోగించి.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్

సాధారణంగా కోపం వస్తే మన పక్కన ఎవరుంటే వారిపై తీర్చేసుకుంటాం. మన కోపమే మన శత్రువు అని కూడా అంటుంటారు. కోపాన్ని నియంత్రించుకోకపోతే మనకు అది చేటు చేస్తుంది. ఇంటి దగ్గర అయితే మన కోపాన్ని కుటుంబ సభ్యులపై తీర్చేసుకుంటాం. అదే అధికారులకు కోపం వస్తే..

Viral Video: ఎస్పీకి కోపం వచ్చింది.. అధికారాన్ని ఉపయోగించి.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్
Bihar Police
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 11, 2022 | 2:05 PM

Viral News: సాధారణంగా కోపం వస్తే మన పక్కన ఎవరుంటే వారిపై తీర్చేసుకుంటాం. మన కోపమే మన శత్రువు అని కూడా అంటుంటారు. కోపాన్ని నియంత్రించుకోకపోతే మనకు అది చేటు చేస్తుంది. ఇంటి దగ్గర అయితే మన కోపాన్ని కుటుంబ సభ్యులపై తీర్చేసుకుంటాం. అదే అధికారులకు కోపం వస్తే ఇంకేముందు కింద ఎంతో మంది సబార్డినేట్లు ఉంటారు వారిపై తీర్చేచుకుంటారు. అది కేవలం మాటలవరకు అయితే పర్వాలేదు. మా సారే కదా అంటూ చాలా సార్లు సిబ్బంది సర్ధుకుపోతారు. సార్ కు కోపం ఎక్కవు.. కాసేపు అయితే అంతా మామూలే అని అడ్జెస్ట్ కూడా అవుతారు. అదే కోపం మాటలు దాటి.. చేతల వరకు వెళ్తే పెనుప్రమాదమే. విషయం బయటకి వచ్చిందంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి బీహార్ లో జరిగింది. తన అధికారాన్ని ఉపయోగించి ఇద్దరు కింది స్థాయి అధికారులపై తన ప్రతాపాన్ని చూపించాడు ఓ జిల్లా స్థాయి అధికారి.. అదంతా ఫేక్ అంటూ అధికారి బుకాయిస్తున్నప్పటికి.. వీడియో వైరల్ కావడంతో మౌనం వహించడం ఆ అధికారి పనైంది. ఇంతకీ ఏమైందనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ.

కింది స్థాయి ఉద్యోగుల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు కోపం వచ్చింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్‌ఐ, ఇద్దరు ఎస్‌ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈఘటనపై ఎస్పీని ప్రశ్నించగా.. అదేంలేదని.. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు ఎస్పీ నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విషయం బయటకు చెప్తే మరిన్ని ఇబ్బందులుమ పడాల్సి వస్తుందని కిందిస్థాయి అధికారులను ఎస్పీ బెదిరిస్తున్నారనే ఆరోపనలు వస్తున్నాయి. ఈఘటనపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..