Viral Video: కట్నం తీసుకుని పెళ్లిని వాయిదా వేస్తున్న యువకుడు.. నడి రోడ్డుమీద నన్ను పెళ్లి చేసుకో అంటూ యువతి హంగామా

సోమవారం కుటుంబ సమేతంగా బజారుకు వెళ్లిన బాలికకు హఠాత్తుగా అబ్బాయి కనిపించాడు. బాలిక కుటుంబ సభ్యుల సాయంతో పరుగు పరుగున బాలుడిని పట్టుకుంది.

Viral Video: కట్నం తీసుకుని పెళ్లిని వాయిదా వేస్తున్న యువకుడు.. నడి రోడ్డుమీద నన్ను పెళ్లి చేసుకో అంటూ యువతి హంగామా
Girl High Voltage Drama
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2022 | 8:40 AM

Viral Video: బీహార్‌లోని నవాడా జిల్లాలో సోమవారం ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి నడి రోడ్డు మధ్యలో పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో గంటల తరబడి హైవోల్టేజీ డ్రామా సృష్టించింది. మూడు నెలల క్రితమే అమ్మాయికి అబ్బాయితో పెళ్లి నిశ్చయించారని.. అయితే అబ్బాయి పెళ్లి తేదీని పదేపదే వాయిదా వేస్తూ వస్తున్నాడని చెబుతున్నారు. సోమవారం కుటుంబ సమేతంగా బజారుకు వెళ్లిన బాలికకు హఠాత్తుగా అబ్బాయి కనిపించాడు. బాలిక కుటుంబ సభ్యుల సాయంతో పరుగు పరుగున బాలుడిని పట్టుకుంది. ఇంతలో ఆ అబ్బాయి అమ్మాయినుంచి తనను తాను విడిపించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు.

అయితే ఆ యువకుడి ప్రయత్నాలెవీ ఫలించలేదు. ఆ అబ్బాయిని పట్టుకొని..  ‘నన్ను పెళ్లి చేసుకో’ అని పదే పదే అడుగుతూనే ఉన్నది.  నడి రోడ్డు మధ్య అమ్మాయి అబ్బాయిని అడ్డగించింది. ఆ సమయంలో భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసుల జోక్యంతో విషయం అదుపులోకి వచ్చింది. అక్కడికక్కడే ఉన్న కొందరు ఈ విషయాన్ని వీడియో రికార్డ్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

 నన్ను పెళ్లి చేసుకో !

కట్నం తీసుకుని పెళ్లిని వాయిదా వేసిన యువకుడు

ఈ ఘటన రోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహకర్ గ్రామంలో చోటు చేసుకుంది. మీడియా కథనాల ప్రకారం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతానికి చెందిన అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి కుటుంబీకులు మూడు నెలల క్రితమే ఈ యువకుడితో అమ్మాయి పెళ్లి నిశ్చయించారు. ముందుగానే పల్సర్ బైక్, 50 వేల నగదును కూడా కట్నంగా ఇచ్చారు. పెళ్లి సమయం దగ్గరపడినప్పుడల్లా ఆ యువకుడు ఇప్పుడు పెళ్లి చేసుకోనని పెళ్లి తేదీని వాయిదా వేసేవాడు. ఇలా యువకుడు చాలా సార్లు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..