Bangalore Floods Viral Video: బెంగళూరులో వరుసగా నాలుగో రోజు కూడా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేస్తూ.. ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. మరోవైపు ఆకాశం మేఘావృతమైన ఉంది. దీంతో మళ్ళీ భారీ వర్షం కురుస్తుందేమో అనే ఆందోళనతో బెంగళూరు వాసులున్నారు. కొన్ని గంటల నుంచి వర్షం కొంత విరామం ఇచ్చింది. దీంతో నగర ప్రజలు సాధారణ స్థితికి అలవాటు పడడానికి సిద్ధపడుతున్నారు. వరద ప్రాంతాలలో నీటి మట్టం నెమ్మదిగా తగ్గుతుంది. దీంతో వరద ముంపునకు గురైన ప్రాంతాలు , అపార్ట్మెంట్ల నివాసితులు తమ ఇళ్లు, నేలమాళిగల్లోని చేరుకున్న నీటిని బయటకు పంపించడానికి, బురదను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీటి ఎద్దడి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ రోడ్లపైనే నీరు ఉండటంతో వాహనాల రాకపోకలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని బాధితులు చెప్పారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలు, అపార్ట్మెంట్ల నివాసితులు, బంధువులు లేదా స్నేహితుల స్థలాలు లేదా హోటళ్లు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వారు నష్టాన్ని అంచనా వేయడానికి.. తమ ఇంటిని శుభ్రపరచుకోవడానికి తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.
వరదల వంటి పరిస్థితుల మధ్య, ఎప్సిలాన్‌లోని ఉన్నత స్థాయి పరిసరాల్లోని తన విల్లా గదిలో ఒక వ్యక్తి ఈత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో పంచుకున్న క్లిప్‌లో, ఆ వ్యక్తి తన ఇంటిలోని వరదలతో నిండిన గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈత కొడుతూ ఇంటి వస్తువులను పరిశీలిస్తున్నారు. ఈ వీడియోలో ఇంటి వస్తువులు అతని చుట్టూ తేలుతున్నట్లు చూడవచ్చు.
బెంగళూరు వరదల్లో ఓ వ్యక్తి తన ఇంట్లో ఈత కొడుతున్న వైరల్ వీడియోను చూడండి:
#BengaluruFloods: Water floods Epsilon Villa in #BengaluruRain #Karnataka ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయరు బత్తాయిలు 👇 pic.twitter.com/xbuWXWNGbO
— 𝐊𝐂𝐑 𝟐𝟎𝟐𝟑 ❤️🔥 (@RajuKCRTrs9999) September 7, 2022
బెంగళూరులోని ఎప్సిలాన్ ప్రాంతంలో విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, బ్రిటానియా CEO వరుణ్ బెర్రీ, బైజూస్ రవీంద్రన్ , బిగ్ బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు అభినయ్ చౌదరి వంటి బిలియనీర్‌లు నివాసం ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..