Viral Video: దోభీగా మారి బట్టలు ఉతుకున్న కోతి.. నిన్ను చూసి మనిషి నేర్చుకుంటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటోన్న నెటిజన్లు..

జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూడగానే  మీరు ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే వెంటనే మీ పెదవులపై చిరునవ్వు  వస్తుంది. ఇటీవలి కాలంలో కూడా అలాంటి కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Viral Video: దోభీగా మారి బట్టలు ఉతుకున్న కోతి.. నిన్ను చూసి మనిషి నేర్చుకుంటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటోన్న నెటిజన్లు..
Monkey Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2022 | 3:17 PM

Viral Video: మనిషి జీవన విధానానికి కొన్ని రకాల జంతువుల జీవన విధానికి దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపిస్తాయి కొన్ని సంఘటనలు. ముఖ్యంగా కుక్క, పిల్లి, కోతి ,ఏనుగు వంటి జంతువులు అందమైనవి.  మీ మనసు చికాకులో ఉన్నప్పుడు వీటిని చూస్తే చాలు సంతోషము కలుగుతుంది. ఇవి చేసే పనులు ఎంత కోపంలో ఉన్నా నవ్వు తెప్పిస్తాయి. మీ మనస్సును రంజింపజేస్తాయి. జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూడగానే  మీరు ఎలాంటి మూడ్ లో ఉన్నా సరే వెంటనే మీ పెదవులపై చిరునవ్వు  వస్తుంది. ఇటీవలి కాలంలో కూడా అలాంటి కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక కోతి దోబీ గా మారింది..అంతేకాదు బట్టలను ఎంతో సంతోషంగా ఇష్టంగా ఉతుకుతున్నట్లు కనిపిస్తోంది.

కడుపు నిండాలంటే కష్టపడి పనిచేయాల్సిందే ఎవరికైనా.. అందుకనే జీవితంలో కష్టపడి పనిచేస్తేనే.. తనని తాను బతికించుకోవడమే కాదు.. తన కుటుంబాన్ని కూడా పోషించుకోగలడు. అందుకనే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని పనిచేస్తారు. కొంతమంది భిన్నమైన ఉపాధిమార్గాలను  ఎంచుకుంటారు. ఇక అడవిలో నివసించే జంతువులు అయితే తమ ఆకలిని తీర్చుకోవడానికి ఇతర జంవుతులను వేటాడతాయి లేదా పండ్లను తిని కడుపు నింపుకుంటాయి. అయితే మనిషికి మచ్చికైన కుక్క, పిల్లి, కోతి వంటి జంతువులు మాత్రం.. మనిషిని అనుకరిస్తూ.. పనులు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ కోతి మంచి ప్రొఫెషనల్ వాషర్‌మెన్‌లా బట్టలు ఉతుకుతుంది.  కోతి బట్టలు ఉతుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  బట్టలకు అంటిన మురికిని తొలగించడానికి.. ఆ బట్టలను బాది బాది మరీ ఉతుకుతోంది. కోతి శ్రమ..  ధోబీలా ఉతుకుతున్న తీరు చూసి నెటిజన్లు కోతికి ఫ్యాన్స్ అయ్యారు. మనుషులు ఇలా బట్టలు ఉతకడం మొదలు పెడితే వాషింగ్ మెషీన్ల అవసరం తగ్గుతుందని.. ఆరోగ్యానికి ఆరోగ్యమని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..