Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చికెన్ వింగ్స్ ఆర్డర్ పెడితే బోన్స్ డెలివరీ.. ఓ లెటర్ కూడా.. అందులో ఏముందంటే..?

ఓ వ్యక్తి.. ఆకలి వేసి.. ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. తనకు డెలివరీ అయినా ఫుడ్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి.. చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అందులో చికెన్ బోన్స్ ఆ కస్టమర్ కు దర్శనం ఇచ్చాయి కనుక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Viral News: చికెన్ వింగ్స్ ఆర్డర్ పెడితే బోన్స్ డెలివరీ.. ఓ లెటర్ కూడా.. అందులో ఏముందంటే..?
Delivery Boy Eat Chicken
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2022 | 9:56 AM

Viral News: ఆధునిక టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభతరం చేసింది. ఇంతకుముందు.. మనకు ఆకలి వేస్తే.. ఏ సమయంలోనైనా సరే వంటగదికి వెళ్లి కుస్తీ పట్లు పడుతూ.. గారేతి తిప్పి వండుకోవాల్సి వచ్చేది. అయితే కాలక్రమంలో వచ్చిన అనేక మార్పుల్లో భాగంగా ఇప్పుడు మనకు నచ్చిన మెచ్చిన వంటకాలను ఏ సమయంలోనైనా తినవచ్చు. ఆకలి వేస్తే జస్ట్ ఆర్డర్ ఇస్తే చాలు.. మనకు ఇష్టమైన వంటకం.. ఇంటి డోర్ ముందు కనిపిస్తుంది. ఓ వ్యక్తి.. ఆకలి వేసి.. ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. తనకు డెలివరీ అయినా ఫుడ్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి.. చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే అందులో చికెన్ బోన్స్ ఆ కస్టమర్ కు దర్శనం ఇచ్చాయి కనుక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం.. డోర్ డాష్ అనే కస్టమర్ ఆకలి వేసి..  చికెన్ వింగ్‌లను ఆర్డర్ చేసాడు. అయితే అతనికి ఎముకలు మాత్రమే డెలివరీ అయ్యాయి. ప్యాకెట్ ఓపెన్ చేసిన కస్టమర్ షాక్ తిన్నాడు. అయితే ఆ ప్యాకెట్ లో బోన్స్ తో పాటు ఒక నోట్ కూడా దొరికింది. ఆ లెటర్ ను చూసిన తర్వాత కస్టమర్ ఇక డెలివరీ బాయ్ చేసిన పనికి కనీసం ఫిర్యాదు కూడా చేయలేకపోయాడు.

చికెన్ తిన్నాక బోన్స్ డెలివరీ:

ఇవి కూడా చదవండి

చికెన్ వింగ్స్ ను తీసుకుని వచ్చే డెలివరీ బాయ్.. ఆ చికెన్ వింగ్స్ తిన్న తర్వాత ఆ బోన్స్ ని తిరిగి ప్యాకెట్‌లో ప్యాక్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేసి.. అందులో ఒక నోట్‌ కూడా పెట్టాడు. అంతేకాదు కాదు తాను ఇలా చేయడానికి గల కారణాన్ని వివరించాడు. డెలివరీ బాయ్ తనకు చాలా ఆకలి వేసిందని.. ఆ నోట్‌లో రాశాడు. ఆకలిని తట్టుకోలేని తాను కస్టమర్  ఆహారాన్ని తిన్నానని పేర్కొన్నాడు. అంతేకాదు ఇలా చికెన్ తినడంపై కస్టమర్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. అంతేకాదు తన ఉద్యోగంలో సంతృప్తి లేదని, వెంటనే ఉద్యోగం వదిలేస్తున్నానని కూడా ఈ నోట్‌లో రాశాడు.

టిక్‌టాక్‌లో ఈ కథనాన్ని షేర్ చేస్తూ, ప్రజలు అభిప్రాయాన్ని అడిగాడు.  డోర్ డాష్  వింత కథ వైరల్ కావడంతో.. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభించారు. ‘డెలివరీ బాయ్ నిజంగా ఆకలితో ఉన్నాడు’ అని ఒక వినియోగదారు రాశారు. అదే సమయంలో మరొకరు.. ‘మీరు కంపెనీకి ఫిర్యాదు చేయాలి, తద్వారా మీకు డబ్బులు వాపసు ఇస్తారని పేర్కొన్నాడు. దీంతో డోర్ డాష్ తనకు డెలివరీ విషయంలో జరిగిన అసౌకర్యాన్ని సదరు కంపెనీకి ఫిర్యాదు చేసి.. డబ్బులు తిరిగి పొందారని తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..