Viral Video: లైవ్ న్యూస్ చెబుతున్న రిపోర్టర్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుక్క.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. ఒక మహిళా న్యూస్ రీడర్ స్టూడియోలో ఓ వార్తకు సంబంధించిన విశేషాలను అందిస్తుండగా ఆ న్యూస్ ను రిపోర్టర్  కవర్ చేస్తుంది.

Viral Video: లైవ్ న్యూస్ చెబుతున్న రిపోర్టర్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కుక్క.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2022 | 9:28 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటున్నాయి. వీటిని చూసిన తర్వాత ప్రజలు గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కొన్ని వీడియోలు కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి. అదే సమయంలో, కొన్ని వీడియోలు ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తాయి..  కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే సాధారణంగా ప్రజలు తమాషా వీడియోలను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వెంటనే మీకు నవ్వు వస్తుంది.

యాంకర్లు లేదా రిపోర్టర్లు తరచుగా వార్తలను చదివే సమయంలో రకరకాల భంగిమల్లో కనిపిస్తుంటారు. అయితే వారి మొహంలో ఎప్పుడూ సీరియస్‌నెస్ ఉంటుంది కానీ.. కొన్ని సార్లు నవ్వు తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. ఒక మహిళా న్యూస్ రీడర్ స్టూడియోలో ఓ వార్తకు సంబంధించిన విశేషాలను అందిస్తుండగా ఆ న్యూస్ ను రిపోర్టర్  కవర్ చేస్తుంది. రిపోర్టర్ ఛానల్ మైక్ పట్టుకుని రిపోర్ట్ ఇస్తుండగా.. అకస్మాత్తుగా ఓ కుక్క పరుగున వచ్చి రిపోర్టర్ చేతిలోని మైక్ లాక్కొని పరుగెత్తడం ప్రారంభించింది.  లైవ్ న్యూస్ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో షాక్ తిన్నారు రిపోర్టర్, న్యూస్ రీడర్.. వెంటనే తేరుకున్న  మహిళా రిపోర్టర్ తన మైక్ తనకు ఇవ్వమంటూ.,. కుక్క వెనుక పరుగెత్తింది. ఈ మొత్తం ఘటనకు చెందిన వీడియో చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. మేము చేయలేనిది కుక్క చేసింది అంటూ కుక్క చేసిన పనికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

లైవ్ కవరేజ్ వీడియో:

ఈ ఫన్నీ న్యూస్ రిపోర్టింగ్‌తో కూడిన వీడియో @FredSchultz35 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 10 సెకన్ల ఈ వీడియో ప్పటివరకు 75 లక్షలకు పైగా వ్యూస్ , 81 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ వీడియో గత ఏడాది క్రితంది. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టూడియో యాంకర్ లుక్ చూడాల్సిందే అని కొందరు ఫన్నీ కామెంట్ చేశారు. ఈ  వీడియో చాలా ఫన్నీగా ఉందని కొందరు యూజర్లు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..