Viral News: కొడుకు చదవుతున్న స్కూల్లోనే చదువుకుంటున్న తల్లి.. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చదివితే మీరూ ఇన్‌స్పైర్ అవుతారు

29 మిలియన్ల మంది ఉన్న నేపాల్ దేశంలో కేవలం 57 శాతం మంది మహిళలు అక్షరాస్యులు. బాల్యవివాహాలు చట్టవిరుద్ధమైనప్పటికీ అక్కడ విస్తృతంగా జరుగుతూనే ఉంటాయి.

Viral News: కొడుకు చదవుతున్న స్కూల్లోనే చదువుకుంటున్న తల్లి.. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చదివితే మీరూ ఇన్‌స్పైర్ అవుతారు
Parwati Sunar
Follow us

|

Updated on: Aug 29, 2022 | 11:34 AM

Viral News: చదువుకోవాలనే కోరిక పట్టుదల ఉంటే చాలు..వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోందో ఓ మహిళ. తన ఇద్దరి పిల్లలతో కలిసి.. ఇప్పుడు స్కూల్ కు వెళ్తోంది. తాను కనీసం 12వ తరగతి పూర్తి చేయాలనీ భావిస్తున్నట్లు చెబుస్తోంది నేపాలీకి చెందిన ఇద్దరు పిల్లల తల్లి,  పార్వతి సునర్. 15 సంవత్సరాల వయస్సులో తనకంటే ఏడేళ్ల పెద్దవాడైన యువకుడిని ప్రేమించి .. పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో చదువుకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు మళ్ళీ స్కూల్ బాట పట్టింది. తన కొడుకు చదువుతున్న పాఠశాలలోనే చదువుకొంటుంది. ఏడవ తరగతి చదువుతున్న నేపాల్ దేశానికి నైరుతిలో ఉన్న పునర్బాస్ గ్రామంలో పార్వతి అనే మహిళ నివసిస్తోంది. తాను నేర్చుకోవడంలో  ఆనందిస్తున్నానని..  పిల్లలలాంటి క్లాస్‌మేట్స్‌తో స్కూల్ కు హాజరవుతున్నందుకు గర్వపడుతున్నానని చెబుతోంది. 29 మిలియన్ల మంది ఉన్న నేపాల్ దేశంలో కేవలం 57 శాతం మంది మహిళలు అక్షరాస్యులు.

27 ఏళ్ల పార్వతి మాట్లాడుతూ.. తనకు “తగినంత అక్షరాస్యత కావాలని భావించానని.. అందుకనే తిరిగి స్కూల్ లో చేరి చదువుకుంటున్నట్లు చెప్పింది. 16 సంవత్సరాల వయస్సులో తన మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో చదువుకు స్వస్తి చెప్పానని.. ఇప్పుడు ఆ చదువు కోరికను తీర్చుకోవడానికి మళ్ళీ బడి బాట పట్టినట్లు పేర్కొంది.

“అమ్మతో కలిసి స్కూల్‌కి వెళ్లడం తనకు చాలా ఆనందంగా ఉంది” అని ఆమె 11 ఏళ్ల కొడుకు రేషమ్ చెబుతున్నాడు. అంతేకాదు.. చదువు విషయంలో తల్లికంటే తనయుడు వెనుకబడి ఉన్నాడు. తల్లితో కలిసి భోజన విరామాన్ని గడుపుతాడు. సమీపంలోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో    కంప్యూటర్ క్లాసులకు ఇద్దరూ సైకిల్‌పై వెళ్లారు. తాము పాఠశాలకు వెళ్తున్న సమయంలో చదువుగురించి మాట్లాడుకుంటామని.. ఎన్నో విషయాలను నేర్చుకుంటామని రేషమ్ చెబుతున్నాడు. అయితే తన కొడుకు డాక్టర్ అవుతాడని తల్లి పార్వతి కోరుకుంటుంది.  పార్వతి బాగా నేర్చుకుంటుందని గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భరత్ బస్నెట్, జీవన్ జ్యోతి చెప్పారు.

ఇవి కూడా చదవండి

పార్వతి భర్త కుటుంబ పోషణ కోసం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరంలో కూలీగా పనిచేస్తున్నాడు. పార్వతి తన కుమారులు రేషమ్ , అర్జున్  తన  అత్తగారితో కలిసి నేపాల్ లో ఒక రేకుల షెడ్ లో నివసిస్తోంది. తెల్లవారుజాము నుంచి రోజు ప్రారంభిస్తుంది. కనీసం  ఇంటికి మరుగుదొడ్డి లేదు. ఇంటి చుట్టూ ఉన్న పచ్చని పొలాల్లో పని చేయడం,  పుట్టినరోజుల కోసం కేక్‌లను తయారు చేయడం వంటి పనులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటారు.

పార్వతి తన కొడుకుతో పాటు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తుంది. నీలం రంగు బ్లౌజ్, స్కర్ట్‌తో కూడిన స్కూల్ యూనిఫామ్‌ను ధరించి స్కూల్ కు వెళ్తుంది.   నేపాల్ లో ఇప్పటికి మహిళలు వివక్షతను ఎదుర్కొంటున్నారని.. ఇంటి నుంచి బయటకు వచ్చి చదువుకునే విధంగా గ్రామీణ మహిళలకు పార్వతి ఆదర్శమని పేర్కొంటున్నారు.  బాల్యవివాహాలు చట్టవిరుద్ధమైనప్పటికీ అక్కడ విస్తృతంగా జరుగుతూనే ఉంటాయి. “పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేవు” అని స్కూల్ టీచర్ చెప్పారు. “మరుగుదొడ్లు లేనందున చాలా మంది అమ్మాయిలు వారి పీరియడ్స్‌ సమయంలో ఇబ్బందులని స్కూల్ కు వెళ్లడం మానేస్తారు.” అయితే తిరిగి చదువుకునేందుకు పొరుగున ఉన్న భారతదేశంలో ఇంటి పనిమనిషి ఉద్యోగాన్ని  పార్వతి వదులుకుంది. తాను ఎంతకష్టమైనా పడి 12వ తరగతి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..