ముంబయిలో (Mumbai) షాకింగ్ ఘటన జరిగింది. బైకుల్లా రైల్వే స్టేషన్ లో 22 ఏళ్ల యువతి లోకల్ ట్రైన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఆమె ప్రాణాలు కాపాడారు.శనివారం ఈ ఘటన జరిగినట్లు స్టేషన్ లోని రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. లోకల్ ట్రైన్ వేగంగా వస్తున్న సమయంలో ఆమె దానికి ఎదురుగా నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. వీడియో చూస్తుంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికే నిర్ణయించుకుందనే విషయం అర్థమవుతుంది. కానీ రైల్వే సిబ్బంది చాకచక్యం, సమయస్ఫూర్తితో మహిళను కాపాడారు. లేకుంటే తీవ్ర నష్టం జరిగేది. అంతే కాకుండా పట్టాలపై మహిళ నిలబడి ఉండటాన్ని లోకల్ ట్రైన్ లోకో పైలట్ గమనించాడు. దీంతో ట్రైన్ ను స్లోగా చేశాడు. కానీ రైలు మహిళ వద్దకు చేరుకోవడంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు, వ్యక్తుల్లో టెన్షన్ మొదలైంది. పట్టాలపై నుంచి వెళ్లిపోవాలని గట్టిగా అరిచారు. అయినా ఆమె పట్టించుకోలేదు. తమ సత్వర చర్యలతో ప్రాణాలను కాపాడినందుకు ఆర్పీఎఫ్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను తన ధైర్య సాహసాలను ఉపయోగించి ఒకరి ప్రాణం కాపాడాడాని అభినందిస్తున్నారు.
#Mumbai | शनिवार को भायखला स्टेशन पर लोकल ट्रेन के सामने लगभग 22 वर्षीय महिला ने किया आत्महत्या का प्रयास, मोटरमैन व RPF ने बचाई जबाजी से जान।@RPF_INDIA @MumbaiPolice #BycullaStation #RPF #Train #Mumbai #mumbaitrain #localtrain #SuicideAttempt #BreakingNews #NewsAlert pic.twitter.com/awsPzJDfwm
— Indian Mayor (@IndianMayor) August 28, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను మంథన్ కె మెహతా షేర్ చేశారు. “శనివారం బైకుల్లా స్టేషన్‌లో @సెంట్రల్_రైల్వే మోటర్‌మ్యాన్, RPF సిబ్బంది సత్వర చర్యతో ఒక మహిళ ప్రాణాలు దక్కాయని” ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఏడాది జూలైలోనూ బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ట్రాక్ నుంచి ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది వారి ప్రాణాలు కాపాడారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..