Dussehra: స్కూల్ స్టూడెంట్స్ కు బంపరాఫర్.. ఆ రాష్ట్రంలో 22 రోజులు దసరా హాలీడేస్.. అంతే కాకుండా

సెలవు.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఈ మాట వినపడితే చాలు స్కూల్ పిల్లలతో పాటు ఉద్యోగులు ఆనందంతో గంతులేస్తారు. వీక్ అంతా పని చేసి, అలసిపోయిన వారికి సెలవు ఉపశమనం ఇస్తుంది. ఇక పండుగల సందర్భంగా వచ్చే సెలవులు ఇంకా...

Dussehra: స్కూల్ స్టూడెంట్స్ కు బంపరాఫర్.. ఆ రాష్ట్రంలో 22 రోజులు దసరా హాలీడేస్.. అంతే కాకుండా
Dussehra
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 29, 2022 | 9:06 AM

సెలవు.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఈ మాట వినపడితే చాలు స్కూల్ పిల్లలతో పాటు ఉద్యోగులు ఆనందంతో గంతులేస్తారు. వీక్ అంతా పని చేసి, అలసిపోయిన వారికి సెలవు ఉపశమనం ఇస్తుంది. ఇక పండుగల సందర్భంగా వచ్చే సెలవులు ఇంకా ఆనందాన్నిస్తాయి. వీకెండ్ సాధారణమే అయినప్పటికీ పబ్లిక్ హాలీడేస్ (Holidays) ప్రత్యేకమని చెప్పాలి. టూర్లకు వెళ్లాలనుకునే వాళ్లు, కుటుంబంతో సరదాగా బయటపడాలనుకునే వాళ్లు సెలవుల కోసం ముందు నుంచే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక రోజులు, పర్వదినాలను హాలీడేస్ గా ప్రకటించింది. ఆ రోజుల్లో అన్ని రంగాల వారికి సెలవు ఇస్తుంది. ఇక స్కూల్ విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి, దసరా (Dussehra) పండుగలకూ సెలవులు ఇస్తుంటారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అందుకే స్కూల్స్ కు, ఆఫీస్ లకు హాలీడేస్ మంజూరు చేస్తారు. అయితే దసరా పండుగకు ఏ రాష్ట్రంలో ఎక్కువగా సెలవులు ఇస్తారో మీకు తెలుసా.. దుర్గాపూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కార్యాలయాలకు ఈ సెలవులు అందుబాటులో ఉంటాయని, ఆ రోజుల్లో కార్యకలాపాలు జరగవని ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా దుర్గాపూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకొనే వెసులుబాటు కల్పించింది.

కాగా.. 34 పబ్లిక్ హాలీడేస్ తో ఒడిశా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జార్ఖండ్ లో 33 రోజులు, అసోం, హిమాచల్ ప్రదేశ్ 32 రోజులు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ 28 సెలవులు కలిగి ఉన్నాయి. అయితే పశ్చిమ బంగాల్ లో ఈ 28 పబ్లిక్ హాలీడేస్ తో పాటు దసరా, దుర్గాపూజ సందర్భంగా ఇస్తున్న సెలవులు అదనం. దేశంలో అతి తక్కువ పబ్లిక్‌ హాలిడేస్‌ ఉన్న రాష్ట్రం ఢిల్లీ గా ఉంది. ఇక్కడ కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 15 రోజులతో బిహార్‌ రెండో వరసలో నిలిచింది. వీటి తర్వాత కర్ణాటక (16) ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్యరాష్ర్టాలు మినహాయిస్తే రాష్ర్టాల సగటు సెలవుల సంఖ్య 25 రోజులుగా ఉంది. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే సెలవుల విధానం తెలుసుకోవడం ఆసక్తికరమే కదా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి