Health: బరువు తగ్గేందుకు డైటింగ్.. చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యానికి కారణమా..
మారిపోయిన జీవన విధానం, వేగంగా పెరిగిపోతున్న సాంకేతికత, అత్యాధునిక పరికరాల కారణంగా పనులు చిటికెలో అయిపోతున్నాయి. పరికరాలు, యంత్రాల సహాయంతో అన్ని రకాల పనులు పూర్తవుతుండటంతో శరీరానికి...
మారిపోయిన జీవన విధానం, వేగంగా పెరిగిపోతున్న సాంకేతికత, అత్యాధునిక పరికరాల కారణంగా పనులు చిటికెలో అయిపోతున్నాయి. పరికరాలు, యంత్రాల సహాయంతో అన్ని రకాల పనులు పూర్తవుతుండటంతో శరీరానికి శ్రమ లేకుండా పోయింది. సరైన వ్యాయామం లేకపోవడంతో బద్ధకంగా తయారవుతోంది. ఫలితంగా బరువు పెరిగేస్తున్నాం. ఈ సమస్య ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ఎలాగైనా బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో తెలిసీ తెలియని విధంగా డైటింగ్ చేస్తారు. కడుపు మాడ్చుకుని పస్తులుంటారు. అధిక వ్యాయామం చేస్తూ చెమటలు కక్కుతుంటారు. అయితే వెయిట్ లాస్ ప్రక్రియలో ఇవన్నీ తీవ్ర పరిణామంగా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం చేసే చిన్న చిన్న తప్పులు ఆరోగ్యంపై తీవ్ర దష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం బాడీకి సంబంధిచినది మాత్రమే కాదు. అది ఆరోగ్యానికి సంబంధించినది కూడా. బరువు తగ్గడానికి శరీరాన్ని హింసించే పద్ధతులు ఫాలో కాకూడదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
గతంలో బరువు తగ్గేందుకు ఫాలో అయిన టిప్స్ ను మళ్లీ ఫాలో అవ్వొ్ద్దు. ఎందుకంటే వాటి ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గతంలో మీకు డైట్ బాగా పని చేస్తే అది ఇప్పుడు సూట్ అవుతుందని కచ్చితంగా చెప్పలేం. శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా డైట్ మెయింటేన్ చేయాలనే విషయాన్ని గమనించాలి. కొంత మంది రెండు మూడు రోజులు డైట్, వ్యాయామం చేసి రిజల్ట్ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఇంది మంచిది కాదు. డైటింగ్, వ్యాయామం ఏదైనా సరే.. ఫలితం రావడానికి టైమ్ పడుతుందన్న విషయాన్ని గ్రహించాలి.
కొంతమంది బరువు తగ్గడానికి చాలా తక్కువగా తింటారు. అంతే కాకుండా ఎక్కువగా వ్యాయామం చేస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. వ్యాయామం, డైట్ సమపాళ్లలో ఉన్నప్పుడే మెరుగైన ఫలితం ఉంటుందని సూచించారు. రోజూ అరగంట లేదా ఒక గంట వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.