Telangana: ఇదో వింత ఆచారం.. ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనాలు.. పచ్చిపులుసే పరమాన్నం.. ఎక్కడంటే
శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు.
Sri Kurumurthy Swamy Temple: పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి అటువైపు వెళ్తూ పాదం మోపాడనీ.. స్వామి వారి పాదానికి గుడి కట్టించి ఆనవాయితీ ప్రకారం 200 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అక్కడి భక్తులు. బండ రాతిపై గ్రామస్తులంతా కలిసి శ్రావణమాసం చివరి శనివారం అక్కడే భోజనాలు చేసుకుని వనభోజనం చేస్తారు భక్తులు. బండరాయిపై భోజనాలు చేయడం ఏంటి ఆశ్చర్య పోతున్నారా.? కానీ నిజంగానే ఇక్కడి ప్రజలు అలానే భోజనం చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడ జరుగుతుంది..? అసలు విషయం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శనివారం రోజున గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి పాదం బండపై భోజనం చేస్తారు. అది కూడా బండ పై ఎలాంటి విస్తరాకులు గానీ ప్లేట్లు గానీ లేకుండా, రాతి బండ పై అన్నం పెట్టించుకుని పచ్చిపులుసు వేసుకుని గ్రామస్తులు అందరూ కలిసి తింటారు. వెంకటేశ్వర స్వామి, కురుమూర్తి జాతర కు వెళుతూ మా గ్రామ సమీపంలోని బండ పై కాలు మోపడం తో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని ఇక్కడి పూర్వీకులు చెప్పినట్టుగా గ్రామస్తుల నమ్మకం.
శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకుంటారు. రాతి బండ పై ఎలాంటి విస్తరాకులు లేకుండా సహాపంక్తి భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి