Viral News: ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ బంగారు నిధి.. పంచుకున్న 8 మంది కూలీలు.. ఆ తరువాతే అసలు ట్విస్ట్‌..!

ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా నిజంగానే కోట్ల రూపాయల విలువచేసే బంగారం నిధి, పురాతన నాణేలు లభించాయి. దాంతో తవ్వకాలు జరుపుతున్న కూలీలు ఆ నిధిని సమానంగా పంచుకున్నారు.

Viral News: ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా బయటపడ్డ బంగారు నిధి.. పంచుకున్న 8 మంది కూలీలు.. ఆ తరువాతే అసలు ట్విస్ట్‌..!
Antique Coins
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 28, 2022 | 12:18 PM

Madhya Pradesh: పురాతన కట్టడాలు, నిర్మాణాలు తవ్వుతుండగా బంగారు, వెండి, పురాతన నాణేలు లభించటం తరచూ వార్తల్లో చూస్తుంటాం..అయితే, ఇక్కడ ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా నిజంగానే కోట్ల రూపాయల విలువచేసే బంగారం నిధి, పురాతన నాణేలు లభించాయి. దాంతో తవ్వకాలు జరుపుతున్న కూలీలు ఆ నిధిని సమానంగా పంచుకున్నారు. కానీ, అంతలోనే వారికి ఊహించని షాక్‌ తగిలింది. అదేంటి..? ఆ నిధి బయటపడిన ప్రదేశం ఎక్కడ..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తున్నాడు. అందుకోసం కూలీలను ఏర్పాటు చేశాడు. అయితే, పునాధులు తవ్వుతుండగా ఆ భూమిలో బంగారు నిధి దొరికింది. అందులో భారీగా బంగారం, పురాతన నాణాలు ఉండటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. దొరికిన బంగారం, నాణేలను గుట్టు చప్పుడు కాకుండా కూలీలందరూ కలిసి సమానంగా పంచుకున్నారు. కానీ, నిధి విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం నాటికి నిధిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి పునర్నిర్మాణంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కూలీలను అరెస్టు చేసిన పోలీసులు బంగారం, కిలో బరువున్న ఆరు లక్షలు విలువైన ఇనుప లాంటి లోహంతో పాటు మొత్తం రూ. కోటి రూపాయల విలువైన వస్తువులను ధార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సమీర్ పాటిదార్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సమాచారం ప్రకారం, నల్చా దర్వాజా సమీపంలోని చిట్నీస్ చౌక్‌లో శివనారాయణ రాథోడ్ ఇల్లు రెండు భాగాలుగా నిర్మించబడింది.కుటుంబం ఒక భాగంలో నివసిస్తుంది. మరొక భాగం శిథిలావస్థలో ఉంది. నెల రోజులుగా ఈ భాగాన్ని పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్నారు. సైట్‌లో పనిచేస్తున్న కూలీలు ఒక గోడలో పాత బంగారు నాణేలు (గిన్ని),బంగారు ఆభరణాలను కనుగొన్నారు. వాటి గురించి ఎవరికీ తెలియకుండా తమలో తాము పంచుకున్నారు. అయితే కొన్ని పాత ఆభరణాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి యాక్టివ్ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి