Road Accident: పని కోసం వెళ్తుంగా దూసుకొచ్చిన మృత్యువు.. లారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం..
ఈ ప్రమాదంలో మైనర్‌తో సహా ఐదుగురు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. మృతులను అనంత్ సమల్, ప్రహ్లాద్ సమల్, ఆదికాంద్ సమల్, అంకుర్ సమల్, అతని కుమారుడు దిబ్యరంజన్ సమల్‌గా గుర్తించారు.
Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న బొగ్గు లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటన డెంకానల్జిల్లాలో ఆదివారం ఉదయం జరిగింది. కామాఖ్యనగర్‌లోని ఎన్‌హెచ్-53లోని పాతర్‌ఖంబా చక్ సమీపంలో వేగంగా వస్తున్న బొగ్గు లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మైనర్‌తో సహా ఐదుగురు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. మృతులను అనంత్ సమల్, ప్రహ్లాద్ సమల్, ఆదికాంద్ సమల్, అంకుర్ సమల్, అతని కుమారుడు దిబ్యరంజన్ సమల్‌గా గుర్తించారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బంగూర గ్రామానికి చెందిన వారని, ఆటోలో పని కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి