AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: తల్లికి పట్టిన దెయ్యం వదిలిస్తానంటూ కూతురిపై కన్ను.. 16 ఏళ్ల పడుచుపిల్లకు తాళికట్టిన 62 ఏళ్ల తాంత్రికుడు..

16 ఏళ్ల బాలికను వృద్దుడు వివాహం చేసుకున్న విషయం బయటికి రావడంతో గ్రామంలో సంచలనంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన పై చర్చించుకుంటున్నారు.

Andra Pradesh: తల్లికి పట్టిన దెయ్యం వదిలిస్తానంటూ కూతురిపై కన్ను.. 16 ఏళ్ల పడుచుపిల్లకు తాళికట్టిన 62 ఏళ్ల తాంత్రికుడు..
Marriage
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2022 | 10:51 AM

Share

Anantapur District: మోసపోయేవాళ్లు ఉన్నంత వరకూ మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఉమ్మడి అనంతరం జిల్లాలో జరిగిన ఈ అమానుష సంఘటన. 16 ఏళ్ల బాలికపై కన్నేసిన 62 ఏళ్ల వృద్ధుడు..మంత్రాలు, క్షుద్రపూజల పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. విషయం కాస్త స్థానిక ఐసీడీఎస్ అధికారులకు చేరింది. దాంతో సదరు తాంత్రీకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామంలో వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జయకృష్ణ అలియాస్ జడల స్వామి(62), 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న అమానుష సంఘటన చోటుచేసుకుంది. యల్లనూరు మండలం పాతపాలెం కు చెందిన జయకృష్ణ కొంతకాలం కిందట కృష్ణాపురం గ్రామానికి వలస వచ్చి ఇక్కడ జడల స్వామిగా క్షుద్ర పూజలు చేయడంలో పేరుగాంచాడు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. రాప్తాడు మండలానికి చెందిన వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని జడల స్వామి వద్దకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో జడల స్వామి కన్ను వారి కుమార్తెపై పడింది. ఆమెకు దెయ్యం పట్టిందని క్షుద్ర పూజలు చేసి, తాను పూజలు చేయడం వల్లనే ఆమె అనారోగ్యం బాగా అయిందని నమ్మించాడు. మూడు నెలల క్రితం గుట్టు చప్పుడు కాకుండా రాప్తాడు మండలంలోని ఓ ఆలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక సమీప బంధువు ఈ విషయం తెలుసుకొని ఐసిడిఎస్ పీడీ శ్రీదేవికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేశారు. దాంతో ఐసిడిఎస్ సిడిపిఓ ధనలక్ష్మి, రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి తో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు.

అధికారులు రంగంలోకి దిగారనే విషయం తెలియడంతో నిందితుడు పరారయ్యాడు. జడలస్వామికి భార్య, కుమార్తె ఉండగా.. కుమార్తెకు వివాహమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీడీఎస్‌ అధికారులు బాలికను అనంతపురంలోని ఉజ్వల హోం కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షుడుగా కొనసాగుతుండడం కొసమెరుపు.

16 ఏళ్ల బాలికను వృద్దుడు వివాహం చేసుకున్న విషయం బయటికి రావడంతో గ్రామంలో సంచలనంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన పై చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ