Tomato Flu: పిల్లల్లో వేగంగా వ్యాపిస్తున్న టమాటా ఫీవర్‌.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ.. అక్కడ హై అలర్ట్‌

పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో టమాటా ఫీవర్ పెరుగుతుండగా, కర్ణాటకలోనూ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.

Tomato Flu: పిల్లల్లో వేగంగా వ్యాపిస్తున్న టమాటా ఫీవర్‌.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ.. అక్కడ హై అలర్ట్‌
Tomato Fever
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2022 | 1:43 PM

Tomato Flu : కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచాన్ని కొత్త వైరస్‌లు, వింత వింత రోగాలు భయపెట్టిస్తున్నాయి. ఇప్పటికే మంకీపాక్స్‌ భయంతో ప్రజలు అల్లాడిపోతుంటే..ఇప్పుడు అందరినీ టమాటా ఫీవర్ వెంటాడుతోంది. జ్వరం, కండరాల నొప్పితో ప్రజలు మంచం పడుతున్నారు. టామాట ఫివర్‌ కూడా మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేరళలోని కొల్లం జిల్లాలో మే 6న తొలి టమాటా ఫివర్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం కేరళలో ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, తమిళనాడులో కూడా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కర్ణాటకలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టమాటా ఫివర్‌ ప్రమాదం పొంచి ఉందనే భయాందోళన వ్యక్తమవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో టమాటా ఫీవర్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రానికి కూడా వ్యాపిస్తుందనే భయం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో టమాటా జ్వరం వచ్చే ప్రమాదం ఉన్న దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ భావించింది.

టమాటో ఫ్లూ విజృంభణపై కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టొమాటో ఫ్లూ పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఆరోగ్యశాఖ.. సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని, నిఘా ఉంచాలని డీహెచ్‌ఓలను ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం.

పిల్లల్లో చాలా త్వరగా వ్యాపిస్తున్న ఫ్లూ.. టమాటో ఫీవర్‌ అనేది పిల్లల్లో ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలలో ఆందోళన కలిగిస్తుంది. ఈ జ్వరం పిల్లల్లో చాలా త్వరగా వ్యాపిస్తోందని, పిల్లలు తరచూ చేతి వేళ్లు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ తల్లిదండ్రులకు సూచించింది.

ఇవి కూడా చదవండి

టమోటా జ్వరం లక్షణాలు టొమాటో జ్వరం లక్షణాలు చిన్న పొక్కులు, చేతుల చుట్టూ, నోటి చుట్టూ ఎర్రటి పొక్కులు, విరేచనాలు, జ్వరం, వాంతులు,గొంతు నొప్పి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి