Viral Video: పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఆమె పై నిల్చోని పడగ విప్పిన నాగుపాము.. చివరకు ఏం జరిగిందంటే..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Aug 27, 2022 | 1:03 PM

ఓ మహిళ తన పొలంలో నిద్రిస్తుండగా, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదుగానీ, ఓ నాగుపాము వచ్చి ఆమె నడుం మీదుగా పడగవిప్పి ఆమెపై కూర్చుంది.

Viral Video: పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఆమె పై నిల్చోని పడగ విప్పిన నాగుపాము.. చివరకు ఏం జరిగిందంటే..
Snake With Woman

Follow us on


Viral Video: సాధారణంగా చాలామందికి పాములంటే చచ్చేంత భయం.. వాటిగురించి మాట్లాడుతున్నా కూడా భయంతో వణికిపోతారు. కలలో పాము కనిపించినా చలి జ్వరం తెచ్చుకునే వాళ్లు ఉంటారు. కానీ ధైర్యంగా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ భయాలన్నీ పటాపంచలవుతాయి. పాముని చూస్తే ఎవ్వరికైనా గుండె అదరాల్సిందే…అల్లంత దూరం పరిగెత్తాల్సిందే..! అలాంటిది ఇక్కడ ఓ నాగుపాము.. నిద్రపోతున్న మహిళపైకి ఎక్కి పడగవిప్పింది..ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్‌ అవుతారు..వివరాల్లోకి వెళితే..

విశ్రాంతి తీసుకునేందుకు పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళపై నాగుపాము పడగవిప్పి కూర్చుంది..ఈ ఘటన కలబురిగి జిల్లాలోని అఫజల్‌పూర్ తాలూకా మల్లాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన భాగమ్మ బద్దల్ అనే మహిళ తన పొలంలో నిద్రిస్తుండగా, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదుగానీ, ఓ నాగుపాము వచ్చి ఆమె నడుం మీదుగా పడగవిప్పి ఆమెపై కూర్చుంది. వెంటనే మెలకువ వచ్చిన భాగమ్మ..ప్రాణభయంతో వణికిపోయింది.వెంటనే చేతులు పైకెత్తి ఆ దేవుడిని వేడుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో చూసినట్లుగా, భాగమ్మ పొలంలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచంపై పడుకుని ఉంది. ఇందులో ఓ నాగుపాము ఎక్కి పడుకుని ఉన్న భాగమ్మపై పడగవిప్పి నిల్చుంది. ఈ విషయం తెలిసిన భాగమ్మ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భయంతో “కాపాడు శ్రీశైల మల్లయ్య” అంటూ ప్రార్థించింది. కొంతసేపటికి ఆ మహిళకు ఎలాంటి హానీ కలిగించకుండా ఆ నాగుపాము కిందకు దిగి వెళ్లిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu