AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మిస్టర్ హ్యాండ్సమ్.. పాన్ ఇండియా మూవీతో వచ్చేస్తున్నాడు.. గుర్తుపట్టండి..

క్యూట్ అండ్ అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. ఇండియన్ మిస్టర్ హండ్సమ్.. అంతేకాదు ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ. ఫేవరేట్ హీరో కూడా. ఎవరో చెప్పేయ్యండి.

Viral Photo: ఈ కుర్రాడు ఇప్పుడు ఇండియన్ మిస్టర్ హ్యాండ్సమ్.. పాన్ ఇండియా మూవీతో వచ్చేస్తున్నాడు.. గుర్తుపట్టండి..
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2022 | 12:59 PM

Share

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇక అదే బాటలో విడుదలైన పలు చిత్రాలు మాత్రం నిరాశ పరిచాయి. ఇక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు హీరోస్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, యశ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా వారి బాటలోనే మరో హీరో రాబోతున్నాడు. తొలిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడెవరో తెలుసుకుందామా. పైన ఫోటోను చూశారు కదా. క్యూట్ అండ్ అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. ఇండియన్ మిస్టర్ హండ్సమ్.. అంతేకాదు ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ. ఫేవరేట్ హీరో కూడా. ఎవరో చెప్పేయ్యండి.

పైన ఫోటోలో ఉన్న కుర్రాడు మరెవరో కాదు. బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో రణబీర్ కపూర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో రణబీర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మూడు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రంలోని మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ పేరుతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, మౌనీ రాయ్, నాగార్జున కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ రాజమౌళితో కలిసి చురుగ్గా పాల్గొంటున్నారు రణబీర్ కపూర్. ఇటీవలే తన ప్రేయసి అలియా భట్‎ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?