Viral Video: సిగ్గుపడుతున్న పెళ్లికూతురు.. అంతలోనే స్టేజ్‌ దద్దరిల్లిపోయే డ్యాన్స్‌ చేసింది.. ఎందుకో తెలిసి అంతా అవాక్కు!

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Aug 27, 2022 | 12:44 PM

ఈ వీడియోలో వధూవరులు డ్యాన్స్ చేయడానికి వేదికపైకి వెళ్లారు. ఓ వైపు వధువు సిగ్గుపడుతున్న క్రమంలో వరుడు రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయటంలో బిజీగా ఉంటాడు. ఇక అంతలోనే..

Viral Video: సిగ్గుపడుతున్న పెళ్లికూతురు.. అంతలోనే స్టేజ్‌ దద్దరిల్లిపోయే డ్యాన్స్‌ చేసింది.. ఎందుకో తెలిసి అంతా అవాక్కు!
Bridal Dance
Follow us


Viral Video: ఇంతకుముందు జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే నేటి పెళ్లిళ్లలో వధూవరులు చాలా సరదాగా ఉంటారు. వివాహ ఆచారాలు కావచ్చు..లేదంటే, వివాహ వేడుకలో డ్యాన్స్ కావచ్చు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వధూవరులు కుటుంబ సభ్యులచేత బలవంతంగా డ్యాన్స్‌ చేస్తుంటారు. ఈ సమయంలో కొందరు జంటలు బ్లష్ చేసుకుంటారు. అయితే కొందరు స్వేచ్ఛగా డ్యాన్స్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధూవరులు డ్యాన్స్ చేయడానికి వేదికపైకి వెళ్లారు. ఓ వైపు వధువు సిగ్గుపడుతున్న క్రమంలో వరుడు రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయటంలో బిజీగా ఉంటాడు.

వీడియోలో వరుడు సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడని అందరూ అనుకుంటారు..వధువు కూడా డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, ఆమె సిగ్గుతో అందరిలో డ్యాన్స్‌ చేయలేకపోతుంది.. కొంత సమయం తర్వాత ఆమె వరుడితో ఏదో గుసగుసలాడింది..ఆ వెంటనే DJ భోజ్‌పురి పాటను ప్లే చేస్తుంది. ఇక అంతే, ఆమెలో దాగివున్న డ్యాన్సర్‌ ఒక్కసారిగా నిద్రలేచినట్టుగానే ప్రవర్తించింది..వరుడితో సహా అందరినీ కనువిందు చేసే విధంగా డ్యాన్స్ చేసింది. పెళ్లికూతురు డ్యాన్స్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వధువు భోజ్‌పురి పాటకు అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ చేస్తున్న తీరుకు బంధువులు, స్నేహితులంతా అవాక్కయ్యారు. క్లాప్స్‌, విజిల్స్ తో హోరెత్తించారు. వధూవరుల ఈ డ్యాన్స్ వీడియో వీకే విలేజ్ వీడియో అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా వీక్షించబడిన వీడియోను బట్టి ఎంత ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu