Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరె! ఏంటిరా ఇది.. బైక్ దొంగలిస్తారనుకుంటే.. చేసిన పని చూస్తే ఫ్యూజులౌట్!

ఈ మధ్యకాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఇళ్ల దగ్గర రెక్కీ చేసి మరీ.. కరెక్ట్ టైం చూసి వాహనాలను ఎత్తుకెళ్తున్నారు

Viral Video: అరె! ఏంటిరా ఇది.. బైక్ దొంగలిస్తారనుకుంటే..  చేసిన పని చూస్తే ఫ్యూజులౌట్!
Theif
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 27, 2022 | 12:57 PM

ఈ మధ్యకాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఇళ్ల దగ్గర రెక్కీ చేసి మరీ.. కరెక్ట్ టైం చూసి వాహనాలను ఎత్తుకెళ్తున్నారు కేటుగాళ్లు. అయితే ఇప్పుడు మేము చూపించబోయే ఈ వీడియోలోని దొంగ.. కొంచెం వెరైటీ.. మీరు అతడు బైక్ దొంగతనానికి వచ్చాడనుకుంటే మీరు పొరబడినట్లే.. అసలు ఏం పని చేశాడో చూస్తే ఫ్యూజులౌట్ కావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై.. ఓ ఇంటి దగ్గరకు వచ్చి ఆగినట్లు మీరు చూడవచ్చు. ఆ ఇంటి గేటు తెరిచి ఉండటమే కాకుండా.. బైక్ కూడా ఉండటంతో..ఆ చుట్టు ప్రక్కల మనుషులెవ్వరూ లేకపోవడంతో దాన్ని దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుకునేరు. అలా అనుకుంటే పొరపాటే.. బైక్ దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి.. దాని అద్దంలో చూసుకుని పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుని ‘ఉప్పల్ బాల్’కు అన్నలాగ నడుచుకుంటూ బైక్ ఎక్కి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

కాగా, ఈ వీడియోను ‘ghantaa’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. అలాగే నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి..