AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎయిర్ గన్ కొన్న పశువుల కాపరి.. ఆ నాయకుడిని చంపేందుకేనంటూ పుకార్లు.. సీన్ కట్ చేస్తే ఊహించని షాక్

చెన్నూరు గ్రామానికి చెందిన వల్లభనేని హరీశ్ అనే గొర్రెల కాపరికి 70 వరకు గొర్రెలు ఉన్నాయి. అయితే గ్రామంలోని కుక్కలు నిత్యం తన గొర్రెల వెంటబడి కరవడానికి ప్రయత్నించేవి.

Telangana: ఎయిర్ గన్ కొన్న పశువుల కాపరి.. ఆ నాయకుడిని చంపేందుకేనంటూ పుకార్లు.. సీన్ కట్ చేస్తే ఊహించని షాక్
Khammam Air Gun
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2022 | 1:13 PM

Share

Khammam Air Gun: ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎయిర్ గన్ కలకలం రేపింది. ఓ గొర్రెల కాపరి ఎయిర్ గన్ పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అది డమ్మీ గన్ అని తేలింది. చెన్నూరు గ్రామానికి చెందిన వల్లభనేని హరీశ్ అనే గొర్రెల కాపరికి 70 వరకు గొర్రెలు ఉన్నాయి. అయితే గ్రామంలోని కుక్కలు నిత్యం తన గొర్రెల వెంటబడి కరవడానికి ప్రయత్నించేవి. దీంతో ఆ కుక్కల నుంచి గొర్రెలను కాపాడుకోవడానికి హరీశ్ చాలా శ్రమ పడాల్సి వచ్చేది. దీంతో కుక్కల బారినుంచి గొర్రెలను కాపాడుకోవడానికి ఎయిర్ గన్ కొనాలని నిశ్చయించుకున్నాడు.

అందుకోసం ఖమ్మం పట్టణంలోని అబ్బాస్ టాయ్స్ సెంటర్‌లో కోబ్రా 65 మోడల్ ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తాను కొనుకున్న ఎయిర్ గన్‌లో ఒక చిన్న గుండ్రటి రాయిను బుల్లెట్ లా పెట్టి కుక్కకు దగ్గరగా పేల్చాడు. దీంతో ఓ కుక్క చనిపోయింది. ఇక అప్పటి నుంచి గన్ను భుజాన తగిలించుకొని హరీశ్ గ్రామంలో తిరిగేవాడు. దీంతో అతడి వద్ద ఉన్నది నిజం తుపాకీ అనుకొని చాలా మంది భయంతో అతడి దగ్గరికి వచ్చేవారు కాదు. అయితే, ఈ ఘటన అనంతరం హరీశ్ కథ అడ్డం తిరిగింది. తాను గొర్రెలు కాసుకునే ఒక సాధారణ వ్యక్తిని , ఏదో కుక్కలను, కోతులను తరిమెందుకు ఎయిర్‌గన్‌ కొన్నానని బాధితుడు వాపోతున్నాడు.

ఇదిలాఉంటే.. గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడిని హత్య చేసేందుకే హరీశ్ తుపాకి కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కుట్ర అంటూ వైరల్‌గా మారిన పోస్టులు ఫేక్ అని పోలీసులు తేల్చారు. గొర్రెలను కాపాడుకునేందుకే గొర్రెల కాపరి ఎయిర్ గన్ కొనుగోలు చేసినట్లు పోలీస్‌లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్