Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: వామ్మో పాము.. మామూలు కొండచిలువ అనుకున్నారు.. కానీ, కాటేస్తే కాటికే అని తెలిసి పరుగులు తీశారు..

మొదట ప్రజలు కొండచిలువగా భావించారు.. అయితే.. అక్కడున్న వారు కొందరు ఫొటోలు తీసి పంపడంతో అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు.

Snake: వామ్మో పాము.. మామూలు కొండచిలువ అనుకున్నారు.. కానీ, కాటేస్తే కాటికే అని తెలిసి పరుగులు తీశారు..
Russell Viper
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 27, 2022 | 9:35 AM

Russell Viper snake: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో 3,000లకు పైగా జాతుల పాములు ఉన్నాయి. వాటిలో సుమారు 600 జాతులు విషపూరితమైనవని జంతు నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో అత్యంత విషపూరితమైన పాము జాతులు కూడా ఉన్నాయి. ఇవి కాటేసిన క్షణాల్లోనే మనుషులు చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బ్లాక్ మాంబా, కోబ్రా, రస్సెల్ వైపర్ లాంటి వాటిని అత్యంత ప్రమాదకర పాములుగా గుర్తించారు. అయితే.. ఈ జాతులన్నీ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా.. భారత్‌లో కూడా అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పాము కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ జాతి పాములు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. మొదట ప్రజలు కొండచిలువగా భావించారు.. అయితే.. అక్కడున్న వారు కొందరు ఫొటోలు తీసి పంపడంతో అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తూ స్థానికులను అప్రమత్తం చేశారు.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన రస్సెల్ వైపర్ శుక్రవారం మధ్యప్రదేశ్ ఖాండ్వాలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో కనిపించింది. తొలుత కొండచిలువగా భావించిన ప్రజలు అటవీశాఖకు సమాచారం అందించారు. కొందరు ప్రజాప్రతినిధులు అటవీశాఖకు ఫొటోలు కూడా పంపారు. అయితే.. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలు సూచనలు చేశారు. పామును రస్సెల్ వైపర్‌గా గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది, పాముకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించడంతో అసలు విషయం బయటపడింది.

అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఇది కొండచిలువ కాదని, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ అని నివాసితులకు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రస్సెల్ వైపర్ పామును రక్షించినట్లు అటవీ శాఖకు చెందిన మల్ఖాన్ సింగ్ తెలిపారు. సివిల్ లైన్ ప్రాంతంలోని రావి చెట్టు దగ్గర ఇది సంచరిస్తుండగా చూశారని పేర్కొన్నారు. కొండచిలువ పాము జాతికి చెందినదని నివాసి మణిశంకర్ పాండే ఫోన్‌లో ఫొటోలు పంపించారని పేర్కొన్నారు. అయితే దాని పరిశీలించగా రస్సెల్ వైపర్ అని తెలిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం పామును పట్టుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ ఆడ పాము వయస్సు దాదాపు మూడున్నర ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. పాములు సాధారణంగా గుడ్లు పెట్టి పొదిగేవిగా ఉంటాయని సింగ్ తెలిపారు. అయితే.. రస్సెల్స్ వైపర్ జాతికి చెందిన పాములు తమ శరీరంలో గుడ్లను పొదిగించుకుంటాయన్నారు. పెద్దవి మాత్రమే కాదు.. ఈ జాతి పాము పిల్లలు పుట్టిన వెంటనే విషపూరితమైనవిగా మారుతాయన్నారు.

రస్సెల్స్ వైపర్ జాతికి చెందిన పాము కాటు కారణంగా రక్తం గడ్డకడుతుంది. ఇది రక్తం ప్రవాహాన్ని ఆపివేస్తుంది.. రస్సెల్ వైపర్ కాటేసిన వ్యక్తి కొన్ని గంటల్లో మరణిస్తాడు. ఈ పాము పొడవు దాదాపు నాలుగు అడుగులు. నాలుగు అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇది నాలుగో జాతి కానీ అత్యంత విషపూరితమైనదని అటవీ సిబ్బంది తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..