Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు గట్టి షాక్.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు గట్టి షాక్.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు
Ghulam Nabi Azad
Follow us

|

Updated on: Aug 26, 2022 | 12:06 PM

Ghulam Nabi Azad resigns: కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు గులాంనబీ ఆజాద్ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి  లేఖ పంపించారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న ఆజాద్‌.. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి పలుసార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆజాద్.. తాజాగా రాహుల్ గాంధీ తీరును కూడా తప్పుబట్టారు. రాహుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందని పేర్కొన్నారు. పార్టీలో ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందన్నారు. సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీది చిన్న పిల్లల మనస్తత్వం అని, ఈ పరిస్థితికి రాహుల్ కారణమని పేర్కొన్నారు. అందరినీ అవమానించారన్నారు.

50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుందంటూ ఆజాద్ పేర్కొన్నారు. ఈ మేరకు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మొత్తం ఐదు పేజీల లేఖను సోనియాకు పంపించారు. గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పలు పదవుల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పలు హోదాల్లో సేవలందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..