CJI NV Ramana: సీజేఐ గా జస్టిస్ట్ ఎన్వీ రమణ విచారించిన అత్యంత ముఖ్యమైన కేసులివే..!

CJI NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన జడ్జిగా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రిటైర్ కాబోతున్నారు. 16 నెలల పాటు సీజేగా సేవలందించిన జస్టిస్ ఎన్వీ రమణ..

CJI NV Ramana: సీజేఐ గా జస్టిస్ట్ ఎన్వీ రమణ విచారించిన అత్యంత ముఖ్యమైన కేసులివే..!
Cji Nv Ramana
Follow us

|

Updated on: Aug 26, 2022 | 12:42 PM

CJI NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన జడ్జిగా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రిటైర్ కాబోతున్నారు. 16 నెలల పాటు సీజేగా సేవలందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. అనేక కీలక కేసులను విచారించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశారు. ప్రధానంగా చూసుకుంటే.. నేడు రిటైర్ కాబోతున్న సుప్రీంకోర్టు సీజేఐ రమణ మూడు కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.

బిల్కిస్ బానో కేసు..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కీస్ బానో కేసు, మనీలాండరింగ్‌ కేసు, పెగాసస్‌ కేసుపై సీజేఐ రమణ నేతృత్వంలోని బెంచ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బానో కేసులో కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది ఖైదీలను క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపై ఘటనపై పలు ప్రజా సంఘాలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ 11 మంది నిందితులను విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అంతేకాకుండా, రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసులో విడుదలైనవారికి స్వాగతం, సన్మానాలు చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్రానికి గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

పెగాసస్ సాఫ్ట్‌వేర్..

పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అక్రమ నిఘా పెడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కమిటీ సుప్రీంకోర్టుకు నివేదికనుసమర్పించింది. ఈ నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని ఈ నివేదిక పేర్కొందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే మొబైల్ ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు నిర్ధారణ ణ కాలేదని వివరించింది. 29 ఫోన్లను ప‌రీక్షించ‌గా, దాంట్లో అయిదు ఫోన్లలో మాత్రమే మాల్‌వేర్‌ గుర్తించినట్టు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్‌లో కూడా పెగాస‌స్ స్పైవేర్ ఉన్నట్టు గుర్తించ‌లేదని కోర్టు తెలిపింది.

మనీలాండరింగ్..

మనీలాండరింగ్‌ చట్ట సవరణపై కూడా కేంద్రానికి సీజేఐ రమణ నేతృత్వంలోని బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. చట్టంలోని వివాదాస్పదమైన రెండు అంశాలపై నోటీసులు ఇచ్చారు. ECIRతో పాటు వారెంట్‌ లేకుండానే అరెస్ట్‌ చేసే అధికారం ఈడీకి ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ కమణ నేతృత్వంలోని బెంచ్‌ అభిప్రాయపడింది.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేసులో కూడా కీలక తీర్పును వెల్లడించారు సీజేఐ రమణ. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు సీజేఐ రమణ.

లైవ్ ప్రొసీడింగ్స్..

ఇదిలాఉంటే.. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి నాంది పలికి సంచలనం క్రియేట్ చేశారు జస్టిస్ట్ ఎన్వీ రమణ. తన చివరి వర్కింగ్ డే రోజు సుప్రీంకోర్టులో విచారణను లైవ్‌లో చూసే అవకాశం కల్పించారు సీజేఐ ఎన్వీ రమణ. ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. రాజకీయ పార్టీ ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌తో పాటు ఇంకొన్ని కీలక కేసుల్లో సీజేఐ ఎన్వీ రమణ బెంచ్‌ విచారణ నిర్వహించింది. ఈ ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉచిత హామీల విచారణను ముగ్గురు జడ్జిల కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు సీజేఐ. ఉచితాల అంశాలపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్వీ రమణపై న్యాయవాదుల ప్రశంసలు..

16 నెలల పాటు సీజేఐగా కొనసాగిన జస్టిస్‌ ఎన్వీ రమణ పలు కీలక కేసులను విచారించడంతో పాటు.. న్యాయ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని ఆయన చెప్పారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చిదిద్దేందుకు జస్టిస్‌ ఎన్వీ రమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. ఆయన కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అద్భుతమైన ప్రగతిశీల దృక్పథం ఉన్న ఆయన న్యాయవ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో