Munawar Faruqui: హైదరాబాద్ సెగ.. ఢిల్లీలో మునావర్ ఫారూఖీ షోకు అనుమతి నిరాకరణ..

హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన కమెడీయన్ ఫారూఖీ.. కారణంగా హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వీహెచ్‌పీ లేఖలో వెల్లడించింది. ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించకుండా ఉంటే..

Munawar Faruqui: హైదరాబాద్ సెగ.. ఢిల్లీలో మునావర్ ఫారూఖీ షోకు అనుమతి నిరాకరణ..
Munawar Faruqui
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 27, 2022 | 12:06 PM

Munawar Faruqui Show in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రేపు (ఆదివారం) ఢిల్లీలో షో చేపట్టేందుకు కమెడీయన్ మునావర్ ఫారూఖీ ఏర్పాట్లు సైతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ సహా పలుచోట్ల చోటచేసుకున్న పరిణామాల నేపత్యంలో పోలీసులు ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించారు. మునావర్ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కోసం చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. అయితే, మునావర్ ఫారూఖీ షోపై ఆగస్టు 25న ఢిల్లీ పోలీస్ కమిషన్ సంజయ్ అరోరాకు.. విశ్వహిందూ పరిషత్ లేఖ కూడా రాసింది. హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన కమెడీయన్ ఫారూఖీ.. కారణంగా హైదరాబాద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వీహెచ్‌పీ లేఖలో వెల్లడించింది. ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించకుండా ఉంటే.. నిరసన ప్రదర్శన చేపడతామని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ పేర్కొంది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లో జరిగిన షో రోజునే.. బెంగళూరు నగరంలోనూ మునావర్ ఫారూఖీ షోకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.

కాగా.. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ పర్యటన అనంతరం తెలంగాణలో పొలిటికల్ హీట్ తోపాటు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మునావర్ ఫారూఖీ ఈ నెల 20న (గత శనివారం) హైదరాబాద్‌ షో నిర్వహించాడు. హిందూ వ్యతిరేకి అయిన మునావర్ కామెడీ షో హైదరాబాద్‌లో నిర్వహించడానికి వీల్లేదంటూ బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులు ఆరాధించే సీతారాముడులను కించపరిచేలా మట్లాడే మునావర్‌ షోకు అనుమతించడం తగదంటూ పేర్కొన్నాడు. అయితే.. హై సెక్యూరిటీ మధ్య పోలీసులు ఈ షోకు అనుమతించారు. అనంతరం రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది కాస్త హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ సైతం విధించారు.

మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా రాజాసింగ్‌ ఓ వీడియోలో వ్యాఖ్యలు చేశారని ముస్లిం నాయకులు ఆరోపిస్తుండగా.. తాను మహమ్మద్‌ ప్రవక్తపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్‌ చెబుతున్నారు. మరోవైపు, దీనిపై స్పందిస్తూ.. బీజేపీ రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయనకు షోకాజ్‌ నోటీసు సైతం జారీ చేసింది. వీడియో అనంతరం మొదట రాజాసింగ్‌ను అరెస్టు చేయగా.. నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం పలు కేసుల్లో ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..