Jayalalithaa: జయలలిత మృతిపై ముగిసిన ఆర్ముగ స్వామి కమిషన్ విచారణ.. ఫైనల్ రిపోర్టులో కీలక విషయాల వెల్లడి
సుధీర్ఘకాలంపాటు జయలలిత మృతిపై సుమారు ఐదేళ్ల విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తుది నివేదికను రూపొందించి.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు.

Former Chief Minister J Jayalalitha death report: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎట్టకేలకు విచారణ పూర్తైంది. రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి.. శనివారం సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి నివేదికను అందజేశారు. సుధీర్ఘకాలంపాటు జయలలిత మృతిపై సుమారు ఐదేళ్ల విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తుది నివేదికను రూపొందించి.. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక గల కారణాలు, పలు విషయాలను తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 2017లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆరుముగ స్వామి కమిషన్ గత 5 సంవత్సరాలుగా వివిధ పార్టీలను విచారించింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. అటు కమిటీ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. జయలలిత మృతికి సంబంధించి 158 మందిని విచారించిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి.. 590 పేజీల ఫైనల్ రిపోర్టును రూపొందించారు.
జయలలిత మృతికి సంబంధించిన తుది నివేదికను ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేసిన అనంతరం రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి మీడియాతో మాట్లాడారు. విచారణలో సాక్షులని విచారించడానికి తాను ఎలాంటి ఆలస్యం చేయలేదని పేర్కొన్నారు. అందరినీ అన్ని కోణాలలో విచారించినట్లు తెలిపారు. విచారణ ఆలస్యం అవడానికి తాను కారణం కాదంటూ పేర్కొన్నారు. జయలలిత మృతిపై శశికళ వర్గంతో సహా అందరూ విచారణకి సహకరించారని తెలిపారు. శశికళ విచారణకి హాజరుకాలేదు కావున.. రాత పూర్వకంగా విచారణకి సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించారని పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..