AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రేమ వ్యవహారం కారణంగా దారుణ హత్య చోటుచేసుకుంది. తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడనే కక్షతో మహేష్ అనే వ్యక్తి అఫ్సర్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
Youth Hacked To Death In Sadashivpet
P Shivteja
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 11:47 AM

Share

సదాశివపేట, నవంబర్ 1: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఘోర దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు కత్తుల దాడికి బలైపోయాడు. తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఓ వ్యక్తి సదరు యువకుడిని నడిరోడ్డుపై అతి దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మరియు స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన అఫ్సర్ అనే యువకుడు,నిందితుడైన మహేష్ చెల్లెలిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ వ్యవహారం మహేష్‌కు అస్సలు నచ్చలేదు.

ఈ విషయమై గతంలోనే అఫ్సర్, మహేష్ మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. అఫ్సర్‌ను ఎంత హెచ్చరించినా వినకపోవడంతో,అతడిని అంతమొందిస్తేనే ఈ ప్రేమకథకు శాశ్వతంగా ఎండ్ కార్డ్ పడుతుందని మహేష్ పథకం వేశాడు. సమయం కోసం వేచి చూసిన నిందితుడు మహేష్, పథకం ప్రకారం అఫ్సర్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. మెడ, ఛాతీ భాగాల్లో కత్తులతో బలంగా నరకడంతో తీవ్ర గాయాలైన అఫ్సర్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.నిండు ప్రాణం నడిరోడ్డుపై బలికావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

హత్యాయత్నం సక్సెస్ కావడంతో,అఫ్సర్ మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు మహేష్ నేరుగా సదాశివపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సదాశివపేట పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు. హత్యా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తును వేగవంతం చేశారు. పగలే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోర హత్యతో సదాశివపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Follow Us
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు