YouTuber Bobby: పారిపోయిన యూట్యూబర్.. ఆచూకీ చెప్పినవాళ్లకు రూ. 25 వేల రివార్డ్.. విషయమెంటంటే..
అతన్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ. 25000 నగదును బహుమతిగా ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు.
YouTuber Bobby: విమానంలో సిగరెట్ తాగుతూ, రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇటీవల తెగ హల్‌చల్ చేసిన యూ ట్యూబర్ బాబీ కటారియా పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ. 25000 నగదును బహుమతిగా ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగానే బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెగ గాలిస్తున్నారు.
నిందితుడు బాబీ కటారియాపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. కటారియాను అరెస్ట్ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్ ప్రకటించినట్టుగా డెహ్రాడూన్ ఎస్‌ఎస్‌పీ దిలీప్ సింగ్ కున్వార్ తెలిపారు.
బాబీ కటారియా ముస్సోరి కిమ్డీ మార్గ్ మధ్యలో టేబుల్ వేసుకుని కూర్చుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. అంతే కాకుండా పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే వాహనాన్ని నడిపి రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి