AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atal Bridge: ఐకానిక్‌ కైట్‌ థీమ్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌.. ఇదో అద్భుత దృశ్యం..! నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి..

వంతెన అందం రంగురంగుల అలంకరణలు, ఎల్‌ఈడీ లైట్లు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

Atal Bridge: ఐకానిక్‌ కైట్‌ థీమ్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌.. ఇదో అద్భుత దృశ్యం..! నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి..
Atal Bridge
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2022 | 11:09 AM

Share

PM Modi Inaugurate Atal Bridge: దేశంలోని ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఒక సంగ్రహావలోకనం. LED లైట్ల దృశ్యం. దూరం నుండి చూసే వారికి అదో అందమైన అతి పెద్ద చేప ఆకారం. ఒక్క మాటలో చెప్పాలంటే అది మరచిపోలేని అద్భుత దృశ్యం. పాదచారుల కోసం అహ్మదాబాద్‌లోని అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రధాని స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మాజీ ప్రధాని, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం అహ్మదాబాద్‌లోని అటల్‌ బ్రిడ్జ్‌ సిద్ధమవుతోంది. ఈ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. కాగా, రూ.74 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఫుట్‌పాత్‌ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ వంతెన ప్రధానంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

సబర్మతి ఇరు తీరాలను కలిపే మొదటి పాదచారుల వంతెన ఇదే. ఈ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఇతివృత్తం మకర సంక్రాంతి సందర్బంగా గుజరాత్‌లో జరిగిన గాలిపటాలు ఎగరేసే ఉత్సవం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. వంతెన అందం రంగురంగుల అలంకరణలు, ఎల్‌ఈడీ లైట్లు. నెల రోజుల క్రితమే దీని నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి

అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డిసెంబర్ 25, 2021న వాజ్‌పేయి పుట్టినరోజున ఈ వంతెనకు పేరు పెట్టింది. దీని పని జూన్ 22, 2022 న పూర్తయింది. పట్టం పరాత్ పండుగ స్పూర్తితో నిర్మించిన ఈ వంతెనకు అనేక రంగుల గాలిపటాల రూపంలో ఉండటం ప్రధాన ఆకర్షణ. వంతెన పొడవు 300 మీటర్లు, వెడల్పు 10 నుండి 14 మీటర్లు ఉంటుంది. వంతెన నిర్మాణంలో దాదాపు 2,100 మెట్రిక్ టన్నుల మెటల్ ఉపయోగించబడింది.

అటల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీటింగ్ బెంచీలు, డైనమిక్ రంగుల కోసం LED లైటింగ్ సిస్టం, పచ్చదనం, ప్రకృతి అందాలు, ఆర్ట్ అండ్ కల్చరల్ గ్యాలరీ, సమీపంలోనే ఫుడ్‌ కోర్ట్స్‌, టూవీలర్‌, ఫోర్‌ వీలర్స్‌కి అనుకూలంగా పార్కింగ్‌ సౌకర్యం, సైక్లింగ్ మార్గం, బోటింగ్ సందర్శకులకు మరింత ఆహ్లాదాన్నిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి