AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

August 31 Deadline Alert: ఆగస్టు నెల ముగిసేలోపు ఈ మూడు పనులు తప్పక చేసుకోండి.. లేకపోతే నష్టమే..!

August 31 Deadline Alert: ఆగస్ట్ నెల ముగియబోతోంది. ఈ నెలాఖరులోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు చేసుకోవడం బెటర్‌. లేకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని..

August 31 Deadline Alert: ఆగస్టు నెల ముగిసేలోపు ఈ మూడు పనులు తప్పక చేసుకోండి.. లేకపోతే నష్టమే..!
Subhash Goud
|

Updated on: Aug 27, 2022 | 11:13 AM

Share

August 31 Deadline Alert: ఆగస్ట్ నెల ముగియబోతోంది. ఈ నెలాఖరులోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు చేసుకోవడం బెటర్‌. లేకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని పనులను గడువులోపు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేకపోతే ఆర్థిక నష్టాలతో పాటు మరిన్ని చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే అందుకు సంబంధించిన KYC చేయడానికి గడువు ఆగస్టు 31తో ముగియనుంది. దీనితో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) ఖాతాదారులను కూడా ఒక ముఖ్యమైన పనిని పరిష్కరించమని కోరింది. అలా చేయడంలో విఫలమైతే మీ ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుంది. అదే సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి కూడా ఈ వార్త ఉపయోగపడుతుంది. నెలాఖరులోపు మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

  1. PM కిసాన్ పథకం లబ్ధిదారులు: ఈ పథకం కోసం KYC గడువును ప్రభుత్వం 31 ఆగస్టు 2022 వరకు ఉంది. మీరు ఈ పనిని చేయకపోతే మీరు తదుపరి విడత ప్రయోజనం పొందలేరు. 31 జూలై 2022 (PM కిసాన్ స్కీమ్ KYC డెడ్‌లైన్) KYC చేయడానికి ప్రభుత్వం ఇంతకుముందు గడువును విధించింది. పొడిగింపు తర్వాత31 ఆగస్టు 2022 ఉంది. ఈ లోపే ఈ పని పూర్తి చేయని వారుంటే వెంటనే చేసుకోవడం మంచిది. ఇంతకు ముందు కూడా చాలా మంది ఈ పని పూర్తి చేయలేరు. వారికి 11వ విడత ప్రయోజనం రాలేదు. ప్రభుత్వం ఈ పథకం 12వ విడత నగదును సెప్టెంబర్ నెలలో విడుదల చేయవచ్చు.
  2. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లు: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే, ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ మీ ఖాతాను హోల్డ్‌లో ఉంచుతుంది. బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి దీని గురించి సమాచారాన్ని అందిస్తూ, తమ ఖాతా KYC ప్రక్రియను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయని కస్టమర్‌లు ఆగస్టు 31, 2022లోపు చేయాలి. లేకుంటే మీ ఖాతా లావాదేవీలు నిలిచిపోతాయని తెలిపింది.
  3. ITR వెరిఫికేషన్: మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే మీరు దాని వెరిఫికేషన్ పనిని 1 నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాలి. జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారికి దాని వెరిఫికేషన్ కోసం కేవలం 30 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని అందించింది. మీరు మీ రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుండా మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు. ఈ నెలాఖరులోగా ఈ పనులన్ని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి