BSNL Towers: 10 వేల టెలికాం టవర్లను విక్రయించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం.. ఎందుకో తెలుసా..?

BSNL Towers: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 5G సేవలను అక్టోబర్ నెలలో ప్రారంభిస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు . కానీ మరోవైపు BSNL..

BSNL Towers: 10 వేల టెలికాం టవర్లను విక్రయించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధం.. ఎందుకో తెలుసా..?
Bsnl
Follow us
Subhash Goud

|

Updated on: Aug 26, 2022 | 1:40 PM

BSNL Towers: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 5G సేవలను అక్టోబర్ నెలలో ప్రారంభిస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు . కానీ మరోవైపు BSNL తన 10,000 మొబైల్ టవర్లను విక్రయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన మొబైల్‌ టవర్‌లను విక్రయించడం ద్వారా మెరుగైన సేవలందిస్తుందా.? ఇతర టెలికం కంపెనీలతో పోటీ పడనుందా..? అనేది తెలియాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద మొత్తం 13,567 మొబైల్ టవర్లను విక్రయించడం ద్వారా 2025 నాటికి BSNLకి రూ.4,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి BSNL మొదటి దశలో 10,000 టవర్లను విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకోసం కేపీఎంజీని ఆర్థిక సలహాదారుగా నియమించారు.

BSNL ప్లాన్ అంటే ఏమిటి?

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి థర్డ్ పార్టీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కో-లొకేషన్ ఏర్పాటులో ఉన్న టవర్లను మాత్రమే BSNL విక్రయిస్తుంది. ఢిల్లీ, ముంబై మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలను అందించే BSNL మొత్తం 68,000 టెలికాం టవర్లను కలిగి ఉంది. ఈ టవర్లలో 70 శాతం ఫైబర్ కేబుల్స్ ద్వారా అనుసంధానించబడి 4G, 5G సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశంలో ఇంత భారీ టవర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఏకైక టెలికాం కంపెనీ BSNL. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద 2025 నాటికి దశలవారీగా 13,567 టవర్లను BSNLకి, 1350 టవర్లను MTNLకి విక్రయించాలి. రెండు ప్రభుత్వ సంస్థలు కలిపి 14,917 టెలికాం టవర్లను విక్రయించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

నష్టాల నుంచి బయటపడేందుకు BSNL సేవలను ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీని కోసం భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను BSNLతో విలీనం చేయాలని యోచిస్తోంది. ఈ రెండు సంస్థలు కలిసి దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్ సేవలను తీసుకువస్తాయి. అలాగే ఇంటర్నెట్ సేవలను విస్తరించనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..