Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ నగరంలో ఏంతంటే..!
Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా ధరల పెరుగుదల నిలిచిపోయింది. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలో ఆగస్టు 26న..
Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా ధరల పెరుగుదల నిలిచిపోయింది. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలో ఆగస్టు 26న పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.35, కోల్‌కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, విశాఖలో లీటర్ పెట్రోల్ రూ.111.35 ఉంది.
అదే సమయంలో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో రూ.94.28, కోల్‌కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.97.82 ఉండగా, విశాఖలో రూ.99.07గా ఉంది. మే 22న ఆర్థిక మంత్రి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలో చివరి మార్పు జరిగింది. మే 21న లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించింది కేంద్రం. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.8.69, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది.
పెట్రోల్ పై ఎంత పన్ను విధిస్తారు?
రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13. ఎక్సైజ్ సుంకం రూ.19.90, వ్యాట్ లీటరుకు రూ.15.71. డీలర్ కమీషన్ లీటరుకు రూ.3.78. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 నాటికి ఉంది.
డీజిల్‌పై పన్ను ఎంత?
మరోవైపు రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. దీని మూల ధర లీటరుకు రూ.57.92. ఎక్సైజ్ సుంకం రూ.15.80, వ్యాట్ రూ.13.11. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.57. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పన్ను రేటు 15 జూన్ 2022 నాటికి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..