Google Loan Apps: గూగుల్ సంచలన నిర్ణయం.. 2 వేలకుపైగా లోన్స్‌ యాప్‌ తొలగింపు.. కారణం ఏంటంటే..!

Google Loan Apps: గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో లోన్స్‌ అందించే యాప్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అలాంటి యాప్స్‌ను తొలగించే పనిలో..

Google Loan Apps: గూగుల్ సంచలన నిర్ణయం.. 2 వేలకుపైగా లోన్స్‌ యాప్‌ తొలగింపు.. కారణం ఏంటంటే..!
Google
Follow us

|

Updated on: Aug 26, 2022 | 6:29 AM

Google Loan Apps: గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో లోన్స్‌ అందించే యాప్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అలాంటి యాప్స్‌ను తొలగించే పనిలో ఉంది గూగుల్‌. ఇలా లోన్స్‌ అందించే 2వేలకుపైగా యాప్స్‌లను తొలగించింది గూగుల్‌. సమాచారాన్ని తప్పుగా చూపించడం, ఆఫ్‌లైన్‌లో ఈ యాప్స్‌ పనితీరు కారణంగా వాటిపై చర్యలు చేపట్టినట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి యాప్స్‌పై రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది.

వినియోగదారులకే ప్రాధాన్యత:

ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ డైరెక్టర్, ఆసియా పసిఫిక్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ హెడ్ సైకత్ మిత్రా మాట్లాడుతూ.. కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రాంతాలలో నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉందని చెప్పారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ మోసాలను నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జనవరి నుండి భారతదేశంలోని ప్లే స్టోర్ నుండి రుణాలు అందించే 2,000 కంటే ఎక్కువ యాప్‌లను తొలగించినట్లు మిత్రా తెలిపారు. విధానాల ఉల్లంఘన, బహిర్గతం చేయని సమాచారం, తప్పుడు సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. లోన్ యాప్ సమస్య తారాస్థాయికి చేరిందని, ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చూపవచ్చని సూచించారు.

అంతకుముందు దేశంలోని దిగ్గజం టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గత నెలలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కు ఒక్కో షేరు ధర రూ.734 చొప్పున 71 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఎయిర్‌టెల్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న గూగుల్ నిబద్ధతలో భాగంగా ఈ కేటాయింపులు చేసినట్లు ఎయిర్‌టెల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన సమాచారంలో పేర్కొంది. ఇందులో కంపెనీలో $700 మిలియన్ల (సుమారు రూ. 5,224 కోట్లు) ఈక్విటీ పెట్టుబడి ఉంది. ఒప్పందం తర్వాత భారతీ ఎయిర్‌టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ మొత్తం పోస్ట్-ఇష్యూ ఈక్విటీ షేర్లలో 1.2 శాతం గూగుల్ కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కేటాయింపునకు ఎయిర్‌టెల్ ప్రత్యేక డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ