AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Services: దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యేది అప్పుడేనా.. ముందు ఏ నగరాల్లో అంటే..

ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు 5జీ సేవలపై క్లారిటీ ఇచ్చాయి. అయితే ఈసేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది...

5G Services: దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యేది అప్పుడేనా.. ముందు ఏ నగరాల్లో అంటే..
'5g' Technology
Amarnadh Daneti
|

Updated on: Aug 25, 2022 | 9:31 PM

Share

5G Services: ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు 5జీ సేవలపై క్లారిటీ ఇచ్చాయి. అయితే ఈసేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. ముందుగా జియో 5జీ సేవలను ప్రారంభిస్తుందా.. ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందా అనే ఆసక్తి కూడా నెలకొంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ నెట్ వర్క్ ముందుగా 5జీ సేవలు అందిస్తే ఆకంపెనీ సేవలు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తారు. దీంతో రిలయన్స్ జియో కంటే తామే ముందుగా 5జీ సేవలు ప్రారంభించాలని ఎయిర్ టెల్ యోచిస్తోదంఇ. వాస్తవానికి దేశంలోనే అతిపెద్ది టెలికం సంస్థ అయిన రిలయన్స్ వాటాదారుల వార్షిక సమావేశం ఈనెల 29వ తేదీన జరగనుంది. అదే రోజు అతి తక్కువ ధరకే జియో ఫోన్ 5జీని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈఫోన్ ధర రూ.9,000 నుంచి రూ.12,000 మధ్య ఉండొచ్చని ఓ అంచనా వేస్తున్నారు. అయితే ధర ఎంత నిర్ణయించాలనేదానిపై తుది నిర్ణయం వెలువడలేదు.

5జి ఫోన్ రిలీజ్ రోజే 5జీ సేవలు ఎప్పటినుంచి ప్రారంభించేది రిలయన్స్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదేరోజు 5జీ సేవలను కూడా ప్రారంభిస్తుందేమోనని టెలికం వర్గాల్లో చర్చ జరుగతోంది. తొలిదశలో ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ సహా దేశంలోని 13 ప్రధాన నగారాల పరిధిలో హైస్పీడ్ 5జి సేవలు ప్రారంభం అవుతాయని టెలికం శాఖ ప్రకటించింది. 5జి స్పెక్ట్రం వేలం పూర్తయిపోయిన నేపథ్యంలో తమకు కేటాయించిన స్పెక్ట్రానికి సంబంధించిన టెలికం కంపెనీలు చెల్లింపులు పూర్తి చేశాయి. ఆగష్టులోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరిగినప్పటికి.. స్పెక్ట్రం వేలం పూర్తవ్వడంలో కొంత ఆలస్యం కావడంతో ఈసేవల ప్రారంభంలో కొంత జాప్యం జరిగింది. అయితే సెప్టెంబర్ 29న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC)-2022 ప్రారంభం అవుతుంది. ఆరోజే 5జీ సేవలు ప్రారంభించాలని పలు టెలికం కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానుండగా.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో మాత్రమే ఈసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ముందు ఏ కంపెనీ 5జీ సేవలు ప్రారంభం అవుతాయనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..