DRDO కొత్త చైర్మన్‌గా ప్రముఖ సైంటిస్ట్ సమీర్ కామత్ నిమాయకం
DRDO కొత్త ఛైర్మన్‌గా సమీర్ కామత్ నియమితులయ్యారు. సతీష్‌రెడ్డి స్థానంలో కామత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. సతీష్‌రెడ్డిని రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించింది..
DRDO gets a new chief: డీఆర్డీఓ కొత్త చైర్మన్‌గా సమీర్ కామత్‌ను అపాయింట్ చేసింది కేంద్రం. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సతీష్ రెడ్డిని మరో ప్రతిష్టాత్మక పోస్ట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన్ను రక్షణశాఖామంత్రి సలహాదారుగా కేంద్రం నియమించింది. సతీష్‌రెడ్డి స్థానంలో డీఆర్‌డీఓ కొత్త చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ కామత్‌ను నియమించింది. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్‌డీఓ చైర్మన్‌గా ఉన్న సతీష్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
అనంతపురం, హైదరాబాద్‌లోని JNTUలో ఉన్నత చదువులు చదివారు. 1986లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యారు. 2018లో డీఆర్డీఓ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై సతీష్‌రెడ్డికి గట్టి పట్టుంది. ఆయన సారథ్యంలో డీఆర్‌డీఓ అత్యాధునిక మిస్సైళ్లను డెవలప్ చేసింది. డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీలో డీఆర్‌డీఓను అత్యుత్తమంగా తీర్చిదిద్దారాయన. అగ్ని, పృథ్వీ, LLH, INS షిప్స్, సబ్ మెరైన్ల కోసం నేవిగేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బాల్లిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను ఛేదించగల మిస్సైళ్లను ఆయన హయాంలోనే డీఆర్‌డీఓ డెవలప్ చేసింది. డిఫెన్స్ టెక్నాలజీ మీద ఆయనకు గట్టి పట్టు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనను తన సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు.