Tapkeshwar Temple: మునుపెన్నడూ లేని విధంగా తపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలోకి వరద.! వీడియో చుస్తే షాకే..

Tapkeshwar Temple: మునుపెన్నడూ లేని విధంగా తపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలోకి వరద.! వీడియో చుస్తే షాకే..

Anil kumar poka

|

Updated on: Aug 26, 2022 | 9:58 AM

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి.


భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి. తెల్లవారుజామున కురిన భారీవానతో తామస నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో జిల్లాలోని ప్రముఖ ఆలయమైన తపకేశ్వర్‌ మహాదేవ్‌ క్షేత్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఆలయ పరిసరాలు మొత్తం వరద నీటిలో మునిగిపోయాయి. ఇటు హిమాచల్‌ ప్రదేశ్‌ భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. ఇళ్లు, దుకాణాలు నీటమునిగాయి. భారీ వంతెనలు సైతం నేల కూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మృతులకు సీఎం జైరాం ఠాకూర్‌ సంతాపం తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నట్లు చెప్పారు. ధర్మశాల ప్రధాన రహదారిపై విరిగిపడిన కొండచరియలతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 26, 2022 09:58 AM