Kanishka Soni: తనను తానే పెళ్లాడిన ప్రముఖ నటి.. శృంగారానికి పురుషుడితో అవసరం లేదన్న కనిష్క..
ఆధునిక కాలంలో స్వేచ్ఛ పేరుతో మనిషి వింత పోకడలకు పోతున్నాడు.. పురుషుడిని పురుషుడు.. స్త్రీని మరో స్త్రీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది అనుకుంటే..
ఆధునిక కాలంలో స్వేచ్ఛ పేరుతో మనిషి వింత పోకడలకు పోతున్నాడు.. పురుషుడిని పురుషుడు.. స్త్రీని మరో స్త్రీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది అనుకుంటే.. మరొక అడుగు ముందుకు వేసి.. తనని తానే పెళ్లి చేసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు ఇంకొందరు. ఇప్పటికే ఇలాంటి పెళ్లి చేసుకున్న యువతి గురించి విన్నాం.. అయితే ఇప్పుడు పాపులర్ సీరియల్ నటి కూడా తనని తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.హిందీలో పాపులర్ సీరియల్ ‘దియా ఔర్ బాతి హమ్’. ఇది తెలుగులో ‘ఈ తరం ఇల్లాలు’గా డబ్ అయి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ సీరియల్ లో కవిత పాత్రలో నటించి పాపులర్ అయిన గుజరాత్ నటి కనిష్కా సోని కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే తాజాగా తనను తానే పెళ్లాడినట్టు ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది. ఇటీవల ఆమె నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయని, ఓ మహిళ శృంగారానికి పురుషుడితో అవసరం లేదని తెలిపింది. మాట మీద నిలబడే మగాడ్ని తన జీవితంలో చూడలేదని, అందుకే పురుషుడు లేకుండానే జీవితం గడపాలన్న నిర్ణయానికొచ్చినట్లు చెప్పింది. తాను గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. తాను పాపులర్ సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు ఇప్పుడు తనని తాను పెళ్లి చేసుకోవడంతో వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది కనిష్క. ఇదిలా ఉంటే కనిష్క ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..