AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death Penalty: దేశంలో ఇప్పటి వరకు 174 మందికే ఉరి.. ప్రపంచంలో 56 దేశాల్లో మరణ శిక్ష అమలు..!

Death Penalty: దేశంలో నేరాల విషయంలో న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తుంటాయి. ఇక ఉరిశిక్ష విషయానికొస్తే.. ప్రపంచంలోని 56 దేశాల్లో అమలవుతోన్న మరణ శిక్ష అమలవుతోంది..

Death Penalty: దేశంలో ఇప్పటి వరకు 174 మందికే ఉరి.. ప్రపంచంలో 56 దేశాల్లో మరణ శిక్ష అమలు..!
Death Penalty
Subhash Goud
|

Updated on: Aug 26, 2022 | 8:21 AM

Share

Death Penalty: దేశంలో నేరాల విషయంలో న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తుంటాయి. ఇక ఉరిశిక్ష విషయానికొస్తే.. ప్రపంచంలోని 56 దేశాల్లో అమలవుతోన్న మరణ శిక్ష అమలవుతోంది. 2020 వరకు మన దేశంలో దాదాపు 1,200 మందికి మరణ విధించగా, అనంతరం ఆ శిక్ష జీవితఖైదుగా మార్పులు చేశాయి న్యాయస్థానాలు. స్వాతంత్ర్యం తర్వాత భారత దేశంలో ఇప్పటివరకు ఉరిశిక్ష అమలు చేసింది కేవలం 174 మందికే. ఆఖరుగా నిర్భయ కేసు నిందితులు ముగ్గురికి 2020 మార్చిలో ఉరిశిక్ష అమలు చేశారు.

ఉరిశిక్ష అమలు చేసిన… కొన్ని ప్రధాన కేసుల వివరాలు:

☛ డిసెంబర్‌ 1,1975: మావోయిస్టులు భూమయ్య, కిష్టయ్యలకు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ కేంద్ర కారాగారంలోఉరిశిక్ష అమలు.

ఇవి కూడా చదవండి

☛ జనవరి 31, 1982: నేవీ కెఫ్టెన్‌ మదన్‌మోహన్‌ చోప్రా పిల్లలు గీత, సంజయ్‌ అపహరణ, హత్య కేసులో దోషులైన బిల్లా, రంగాలకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ అక్టోబర్‌ 9,1983: ఓ వివాహిత మహిళ హత్య కేసులో కాంట్రాక్ట్‌ కిల్లర్లు కర్తార్‌, ఉజాగర్‌ సింగ్‌లకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ ఫిబ్రవరి11,1984.. కశ్మీర్ మిలిటెంట్ మహ్మద్ మక్బూల్ బట్‌కు తీహర్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ ఫిబ్రవరి 6,1989: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని(31-10-1984) హత్య కేసులో దోషులు సత్వంత్‌ సింగ్‌, కేహర్‌ సింగ్‌లకు తీహార్ జైలులో ఉరిశిక్ష.

☛ ఆగస్టు 14, 2004: ధనుంజయ్ చటర్జీ 21వ శతాబ్దంలో చట్టబద్ధంగా ఉరితీతకు గురైన తొలి వ్యక్తి. నేరం ఏంటంటే.. 1990లో 15 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసులో నేరస్థుడు. కోల్‌కతాలోని అలీపూర్ జైలులో ఉరిశిక్ష అమలు చేసింది న్యాయస్థానం.

☛ నవంబర్‌ 21, 2012:. అజ్మల్ కసబ్(పాకిస్థాన్ దేశీయుడు).. 26-11-2008 ముంబైలో ఉగ్రదాడిలో నేరస్థుడు. యెరవాడ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ ఫిబ్రవరి 9, 2013: అఫ్జల్ గురు కాశ్మీరీ వేర్పాటువాది, 2011 పార్లమెంట్ పై దాడి కేసులో నేరస్థుడు. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ జూలై 30,2013: యూకూబ్ మెమన్ ఉగ్రవాది 1993లో ముంబై బాంబు పేలుళ్లలో నేరస్థుడు. నాగపూర్ జైలులో ఉరిశిక్ష అమలు.

☛ మార్చి 20, 2020: నిర్భయ కేసు నిందితులు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠారూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా ఉరిశిక్ష. 2012లో జ్యోతి సింగ్(23 ఏళ్లు) అనే ఫిజియోథెరపిస్ట్ ను ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసిన కేసులో నేరస్థులు. వీరికి తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు.

ఆఖరి కేసు.. ఉరి కోసం ఎదురుచూపులు:

ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను (తల్లి,తండ్రి, సోదరులు, సోదరి) హత్య చేసిన షబ్నమ్. జూలై 14, 2010న షబ్నమ్, సలీంలకు ఉరిశిక్ష విధిస్తూ యూపీలోని మథుర కోర్టు తీర్పునిచ్చింది. 2013 మథుర కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. మే 15,2 015న నిందితులకు దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేసింది. ఇక ఆగస్ట్, 2016 నిందితుల అభ్యర్థనను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ఇక జనవరి 23, 2020 రివ్యూ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిందితులు షబ్నమ్, సలీంల ఉరితీతకు మథుర జైలులో ఏర్పాట్లు చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అప్పటి నుంచీ వీరి మరణ శిక్ష ఇంతవరకూ అమలు కాలేదు. ఒక వేళ ఈ ఉరిశిక్ష అమలైతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉరిశిక్షకు గురవుతున్న తొలి మహిళగా షబ్నమ్ నిలవనుంది. 1870లో బ్రిటిషర్ల పాలనలో ఒక మహిళను ప్రభుత్వం ఉరి తీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి