Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..

తెలంగాణలో శని, ఆది వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..
Telangana Rain Alert
Follow us

|

Updated on: Aug 25, 2022 | 9:53 PM

Telangana: తెలంగాణలో శని, ఆది వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని, ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పాటు మరో ఆవర్తనం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని తెలిపింది. తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలు ఎక్కవుగా కురిస్తే నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ