Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP-Errabelli: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు.. పార్టీ కండువా కప్పుకున్న మరో మరో ముగ్గురు..

Errabelli Pradeep Rao: ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేశారు. ఢిల్లీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి..

BJP-Errabelli: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు.. పార్టీ కండువా కప్పుకున్న మరో మరో ముగ్గురు..
Errabelli Pradeep Rao
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 25, 2022 | 7:36 PM

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేశారు. ఢిల్లీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, వీటి విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ వరంగల్‌ మాజీ కార్పొరేటర్‌ యోగనంద్‌ కొల్లూరు సైతం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి మంచి మూమెంట్ ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేస్తానని ప్రకటించారు.

2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి టీఆర్ఎస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానంటూ.. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బృందం ప్రదీప్‌రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపి పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం