Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులపై మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం..

Ayushman Bharat Health Cards: రాష్ట్రాల ఆరోగ్య పథకాలతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై కో-బ్రాండింగ్‌ను అనుమతించాలని నిర్ణయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం..

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులపై మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం..
Ayushman Bharat
Follow us
Subhash Goud

|

Updated on: Aug 26, 2022 | 8:51 AM

Ayushman Bharat Health Cards: రాష్ట్రాల ఆరోగ్య పథకాలతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులపై కో-బ్రాండింగ్‌ను అనుమతించాలని నిర్ణయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య పథకాలకు ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు కేంద్రం లోగో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌లు ఇప్పుడు రాష్ట్రాల లోగోను కూడా కలిగి ఉంటాయి. ఇప్పటివరకు దేశంలోని 31 రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకానికి అంగీకరించాయి. అయితే ఇందులో ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో చర్చ కొనసాగుతోంది.

ఆయుష్మాన్ భారత్ అంటే ఏమిటి:

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2018లో ప్రతి పౌరుడికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనతో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడం వల్ల ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆయుష్మాన్ భారత్ పథకం (PM-JAY) కింద COVID-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరికీ ఉచిత ఆరోగ్య బీమాను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలందరూ ఆయుష్మాన్ భారత్ పథకం (PM-JAY) కింద రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో లబ్ధిదారులుగా నమోదు అవుతారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రోగులు ఎంపానెల్డ్ ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి