Forex Scam: రూ.870 కోట్ల కుంభకోణం.. ఇద్దరు ప్రైవేట్ కంపెనీల డైరెక్టర్లకు 27 ఏళ్ల జైలు.. రూ.172 కోట్ల జరిమానా
Forex Scam: దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగిన ఓ పెద్ద కుంభకోణంలో కంపెనీలకు, వాటి డైరెక్టర్లకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. అధిక రిటర్న్‌లు ఇస్తూ స్కామ్‌కు పాల్పడిన కేసులో..
Forex Scam: దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగిన ఓ పెద్ద కుంభకోణంలో కంపెనీలకు, వాటి డైరెక్టర్లకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. అధిక రిటర్న్‌లు ఇస్తూ స్కామ్‌కు పాల్పడిన కేసులో రెండు కంపెనీల డైరెక్టర్లకు కోర్టు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కంపెనీలతో సహా డైరెక్టర్లకు దాదాపు 172 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 870 కోట్లు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కుంభకోణంలో ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టారు.
సీబీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. తిరుప్పూర్‌లోని పాజీ మార్కెటింగ్ కంపెనీల డైరెక్టర్లు కె.మోహన్‌రాజ్, కమలవల్లిలకు కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది తమిళనాడులోని కోయంబత్తూర్ కోర్టు. ఈ కేసులో ఇద్దరు డైరెక్టర్లలో ఒక్కొక్కరికి రూ.42.76 కోట్లు. 3 ప్రైవేట్ కంపెనీలకు ఒక్కొక్కరికి రూ.28.74 కోట్లు అంటే మొత్తం రూ.172 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో నిందితులు నకిలీ స్కీమ్‌తో ప్రజలను రూ.870 కోట్ల మేర మోసగించినట్లు రుజువైందని ఏజెన్సీ పేర్కొంది.
దోషులు జూలై 2008, సెప్టెంబర్ 2009 మధ్య అనేక నకిలీ స్కీమ్‌ల ద్వారా పలువురి నుండి డబ్బు వసూలు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడితో వారిని ఆకర్షించారు. ఈ కేసులో ఫిర్యాదులు స్వీకరించిన సీబీఐ 2011 జూన్‌లో కేసు నమోదు చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏజెన్సీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ట్రయల్ కోర్టు ఈ కేసులో నిందితులతో పాటు మూడు కంపెనీలను దోషులుగా నిర్ధారించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి