Robbery: అర్ధరాత్రి హైవేపై యాక్షన్సినిమా రేంజ్లో ఛేజింగ్.. రూ. 3.60కోట్లు దోపిడీ..!
దుండగుల నుంచి తప్పించుకునేందుకు వాహనంలోని ఆ ఇద్దరు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా స్టైల్కనిపించింది ఈ ఛేజింగ్ సీన్.. కొంతసేపటి తర్వాత..వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. చివరకు బైక్ మీద వచ్చిన దుండగులు కారును పట్టుకున్నారు.
Robbery in Pune : రూ. 3.60కోట్ల నగదుతో వారిద్దరు కారులో బయలుదేరారు. ముందుగానే వారిని పసిగట్టిన దొంగలు నాలుగు బైకల్‌తో వారి వాహనాన్ని వెంబడించారు.. అది గమనించి.. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరు ప్రయత్నించారు. మహారాష్ట్రలో యాక్షన్ సినిమా స్టైల్లో జరిగిన ఛేజింగ్లో.. చివరికి దుండగులు ఆ నగదును దోచుకుని పారిపోయారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. దుండగులు దోచుకెళ్లిన నగదు మొత్తం హవాల మనీగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భవేష్ కుమార్, విజయ్భాయ్అనే ఇద్దరు.. రూ. 3.60కోట్లతో ఓ కారులో గురువారం రాత్రి బయలుదేరారు. పుణె జిల్లాలోని ఇందాపూర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో.. వారి వాహనాన్ని మరో నాలుగు బైక్లు వెంబడించాయి. స్పీడ్ బ్రేకర్ దగ్గర భవేష్ కుమార్ వాహనం కాస్త స్పీడ్ తగ్గించి ప్రయాణిస్తున్నారు. అదే అదునుగా భావించిన దుండగులు చేతుల్లో రాడ్లు పట్టుకుని వారి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, దుండగులను గమనించిన భవేష్ కుమార్, విజయ్భాయ్.. ఒక్కసారిగా వాహనం స్పీడ్ పెంచారు. అక్కడ్నుంచి వేగంగా తప్పించుకుని వెళ్లిపోయారు. కానీ, దుండగులు మాత్రం వారిని వదల్లేదు. వాహనాన్ని వెంబడించారు.
దుండగుల నుంచి తప్పించుకునేందుకు వాహనంలోని ఆ ఇద్దరు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా స్టైల్కనిపించింది ఈ ఛేజింగ్ సీన్.. కొంతసేపటి తర్వాత..వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. చివరకు బైక్ మీద వచ్చిన దుండగులు కారును పట్టుకున్నారు. వాహనాన్ని అడ్డగించి.. లోపల ఉన్న ఇద్దరిని బయటకు లాగేశారు. ఆ ఇద్దరిని చితకబాది.. వారి వద్ద ఉన్న డబ్బుతో అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
అయితే,.. ఈ భవేష్ కుమార్, విజయ్భాయ్ ఎవరు? రూ. 3.60కోట్ల భారీ నగదును వారు వాహనంలో ఎందుకు తీసుకెళుతున్నారు? ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడన్నుంచి వచ్చింది..? ఎక్కడికి తీసుకెళుతున్నారు? వంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వీరి వద్ద ఉన్న డబ్బు అక్రమ నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి