Nayanthara-Vignesh Shivan: నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్‌కు అసలు ఖర్చే లేదా ?.. నెట్టింట వైరలవుతున్న న్యూస్..
ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈఏడాది జూన్ 9న ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు.
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట ప్రస్తుతం హానీమూన్ మూడ్‌లో ఉన్నారు. థాయ్‌లాండ్, స్పెయిన్ దేశాలలో వీరిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. బార్సి, వాలెన్సియాలో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతుంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈఏడాది జూన్ 9న ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. మహాబలిపురంలోని ఓ హోటల్ రిసార్ట్‌లో అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గత కొద్దిరోజులుగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇందుకు ఈ జంట రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వీరి ఒక్కరోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలట. అంతేకాకుండా ఇతర ఖర్చులు మరింత అదనం. వీరి హనీమూన్ ఖర్చు మొత్తం ఓ ప్రముఖ సంస్థ స్పాన్సర్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
పెళ్లి తర్వాత ప్రాజెక్ట్ కంటెంట్ విషయంలో నయన్ రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, పాత్ర ప్రాధాన్యతను బట్టి స్టోరీస్ ఎంపిక జరుగుతున్నట్లుగా టాక్. అంతేకాకుండా నయన్ రెమ్యునరేషన్ సైతం భారీగా పెంచినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ అట్లీ, బాలీవుద్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొననుంది. ఇక అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి తంతును ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వీరి పెళ్లి డాక్యుమెంటరీని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో ప్రసారం చేయనున్నారు. ఇక ఇటీవలే వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.