ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు
బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజాలు వెలుగుచూసాయి. తొలుత గోవాలో సోనాలీ గుండెపోటుతో మరణించినట్లు అంతా అనుకున్నారు.
బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజాలు వెలుగుచూసాయి. తొలుత గోవాలో సోనాలీ గుండెపోటుతో మరణించినట్లు అంతా అనుకున్నారు. అయితే, ఆమె సోదరుడు రింకూ ధాకా ఆమె ఇద్దరు సహచరులపై అనుమానంతో ఫిర్యాదు నమోదు చేయడంతో కథ మలుపు తీసుకుంది. అదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరంపై గాయాలు’ ఉన్నట్లు తెలిసింది. దీంతో గోవా పోలీసులు ఆమె ఇద్దరు సహచరులు సుధీర్ సంగ్వాన్, సుఖ్‌విందర్ వాసీలను అరెస్ట్ చేసి వారి హత్యా నేరం మోపారు. తాజాగా గోవా డీజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ” ఆమెకు బలవంతంగా ఓ ప్రమాదకర కెమికల్ డ్రగ్ ఇచ్చారు. ఉదయం 4:30కి ఆమె ఆరోగ్యం అదుపు తప్పడంతో ఇద్దరిలో ఒక వ్యక్తి ఆమెను టాయిలెట్‌కి తీసుకెళ్లాడు. అక్కడ రెండు గంటలపాటు ఏమి చేశాడనే దానిపై స్పష్టత లేదు. డ్రగ్ కారణంగానే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది’ అని షాకింగ్ విషయం బయటపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియానే నా టార్గెట్.. టీవీ9 సీఈవో బరుణ్ దాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ
News Watch: మొన్న జూ.ఎన్టీఆర్…నేడు నితిన్..తారలతో భేటీ దేనికి సంకేతం ??