Python Viral Video: హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలపై కొండచిలువ హల్‌చల్‌.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..ఇదెక్కడో కాదండోయ్..!

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన కొండచిలువ.. అక్కడ్నుంచి..

Python Viral Video: హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలపై కొండచిలువ హల్‌చల్‌.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..ఇదెక్కడో కాదండోయ్..!
Python Climbed
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 28, 2022 | 12:50 PM

Python Viral Video:  సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని వీడియోలు వినోదాన్ని పంచుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. ఇక మరీ ముఖ్యంగా పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించినది. ఈ వీడియోలో కొండచిలువ చేసిన స్టంట్‌కు స్థానికులతో పాటు, నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు. కొండచిలువ స్టంట్‌ చేయటం ఏంటనే కదా మీ సందేహం.. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం…

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన కొండచిలువ.. అక్కడ్నుంచి నెమ్మదిగా విద్యుత్‌ తీగల పైకెక్కింది. అది చూసిన స్థానిక రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అటవీశాఖ, విద్యుత్ శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు.. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తమైన సిబ్బంది.. హైటెన్షన్ వైర్లు కావటంతో ప్రత్యేక జాగ్రత్తలతో కొండచిలువను కిందపడేశారు.

ప్రత్యేక బోనును ఏర్పాటు చేసి కొండచిలువను బంధించిన అటవీశాఖ అధికారులు.. ఆ తర్వాత దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చుట్టూ అటవీప్రాంతం కావటంతో అక్కడ్నుంచే పొలాల్లోకి వచ్చి…. హైటెన్షన్ వైర్లపైకి పాకుతూ వెళ్లినట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి