AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: బెజవాడలో నాన్‌వెజ్‌ కొనేవారికి షాకింగ్ న్యూస్.. అధికారులు తనిఖీల్లో భయానక నిజాలు

మళ్లీ.. మళ్లీ చెబుతున్నాం. మీరు నాన్-వెజ్ కొనేముందు ఒకటికి.. రెండుసార్లు చెక్ చేసుకోండి. సరైన మాంసం ఎంపిక చేసుకోకపోతే మీరు దిక్కుమాలిన రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

Vijayawada: బెజవాడలో నాన్‌వెజ్‌ కొనేవారికి షాకింగ్ న్యూస్.. అధికారులు తనిఖీల్లో భయానక నిజాలు
Vijayawada Meat Market
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2022 | 12:43 PM

Share

Andhra Pradesh: సండే రోజు చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి.. చికెన్, ఫిష్, లేదా మటన్, రొయ్యలు ఎవరికి నచ్చింది వారు తెచ్చుకుని వండుకుని.. కలిసి తింటారు. ఇక డైలీ నీసు తినేవాళ్లు కూడా ఉంటారు లేండి. ఇలాంటి నాన్‌వెజ్‌ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. మీరు తింటున్నది క్వాలిటీ చికెన్, మటనేనా.. కుళ్లిపోయిన పాచి సరుకా! అన్నది ఒకటికి.. రెండు సార్లు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.  విజయవాడలోని నాన్‌వెజ్‌ మార్కెట్‌లో అధికారులు చేసిన తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. కొత్తపేట(Kothapeta) హనుమంతరాయ చేపల మార్కెట్‌లో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో వ్యాపారస్తుల మోసం బట్టబయలైంది. 80 కేజీల కుళ్లిపోయిన చికెన్‌, మేక తలకాయలు, కాళ్లను గుర్తించారు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. మాంసాన్ని క్వాలిటీ ఉన్నచోట తీసుకోవాలని.. లేకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. సుమారు 25 మేక తలకాయలు, కాళ్లను కుళ్ళిపోయినట్టుగా గుర్తించామన్నారు. కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయించిన వ్యాపారులకు ఫైన్ విధించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం అయితే కేసులు పెడతామన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి