Vizag: అమ్మను కామెంట్ చేసిన వ్యక్తిని వెంటాడి చంపి.. డెడ్‌బాడీ తీసుకొచ్చి తల్లి కాళ్లముందు పడేశాడు
సందుగొందుల్లో తరిమి తరిమి.. కొట్టాడు. అక్కడ బండరాయితో మోది చంపడం మాత్రమే కాదు.. ఆ డెడ్ బాడీని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చాడు. అంత కసీగా ఈ హత్య జరగటానికి గల కారణాలేంటి?
Andhra Pradesh: అది విశాఖపట్నం అల్లీపురం(Allipuram) ప్రాంతం. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆదివారం ఉదయం 5 గంటల 55 నిమిషాల సమయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. గొంతిన శీను అనే ఒక పెయింటర్ మద్యం మత్తులో ఉన్నాడు. ఇంతలో అటుగా వచ్చింది గౌరి అనే వివాహిత. తన పాటికి తాను పనికి వెళ్తోందా మహిళ. ఇంతలో మద్యం మత్తులో ఉన్న శ్రీను ఆమెను కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది.ఇరువురి మధ్య తోపులాట సాగిందనీ.. ఈ క్రమంలో తీవ్రంగా బాధ పడ్డ మహిళ..తన కొడుక్కి సమాచారం ఇచ్చిందనీ చెబుతున్నారు ప్రత్యక్ష సాక్ష్యులు. తన తల్లిని అనడం మాత్రమే కాక.. వాగ్వాదానికి దిగి- తోపులాటకు పాల్పడ్డ శ్రీనును అల్లీపురం సందుగొందుల్లోకి తరుముకుంటూ వెళ్లాడు యువకుడు. అక్కడే అతడిని బండరాయితో మోది చంపాడు. అంతే కాదు..రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి మరీ తన తల్లి ముందు డెడ్ బాడీ పడేసిన దృశ్యాన్ని చూసి.. ఉలిక్కి పడ్డారు అల్లీపురం వాసులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సీసీ ఫుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు..
ఒక చిన్న మాటకు ఇంత భారీ ఎత్తున హత్య చేయడం..సందులోకి పరుగెట్టుకుంటూ వెళ్లి.. అతడ్ని కొట్టి చంపడం.. ఆ డెడ్ బాడీని రోడ్డు మీదకు లాక్కు రావడం చూసి అందరూ షాకై పోయారు. ఈ ఇద్దరి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఒక తాగుబోతు మాట తూలిన ఫలితమా? లేక ఒక కొడుకు క్షణికావేశమా.. అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి