AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అప్రమత్తత లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.. ట్రాఫిక్​ సీఐని ఆర్టీసీ బస్సు ఎలా ఢీకొట్టిందో చూడండి..

విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్‌లో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ వీడియో చూడండి.

Vizag: అప్రమత్తత లేకపోతే ప్రాణాలకే ప్రమాదం..  ట్రాఫిక్​ సీఐని ఆర్టీసీ బస్సు ఎలా ఢీకొట్టిందో చూడండి..
Rtc Bus Hits Police
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2022 | 7:40 PM

Share

Andhra Pradesh: నిత్యం రోడ్డు మీదకు వచ్చే వేలాది వాహనాలను కంట్రోల్ చేసి.. మనల్ని ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడుతుంటారు. ఎండా, వానలను లెక్క చేయకుండా నడిరోడ్డుపై వాహనాల మధ్యలో నిల్చుని.. విధులు నిర్వర్తిస్తూ ప్రమాదాలు జరగకుండా తమవంతు ప్రయత్నం చేస్తారు. పొల్యూషన్ వల్ల కూడా ఎంతో ఇబ్బంది పడతారు.  ఈ క్రమంలోనే కొన్నిసార్లు అవే విధులు వాళ్లను ప్రమాదాల్లోకి నెడతాయి. విశాఖపట్నం పాత గాజువాక జంక్షన్‌(Old Gajuwaka Junction)లోనూ అలాంటిదే జరిగింది. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఓ బస్సు రైట్ టర్న్ తీసుకుంటుండగా.. దాని వెనుకాలే మరో బస్ నేరుగా వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న సీఐ సత్యనారాయణరెడ్డిని ఢీకొట్టింది. ఆయనకు గాయాలు కావడంతో తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి