AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. మూడు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం
నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Weather Alert: శుక్రవారం ఉత్తర అంతర్గత కర్నాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకుఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీంతో నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం వీచే అవకాశం ఉంది. ఎల్లుండి(ఆగష్టు 29వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం వీచే అవకాశం ఉంది. ఎల్లుండి(ఆగష్టు 29వ తేదీ)తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం వీచే అవకాశం ఉంది. ఎల్లుండి(ఆగష్టు 29వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
Dangerous THUNDERSTORMS and rains spreading along Pathapatnam – Palakonda belt of #Srikakulam. West Parts of #Vizag close to Simhachalam getting good rains now and this will move into Anakapalli district.#Nellore and #Prakasam coastal areas getting super rains !! pic.twitter.com/jl39axjreP
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) August 27, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..